AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: షాకింగ్‌ వీడియో.. క్షణాల్లో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. 10 మంది గల్లంతు.. ఎక్కడంటే!

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుడడంతో నదులు, కాలువలు ఉప్పొంది ప్రవహిస్తున్నారు. ఈ క్రమంలో నదిదాటేందుకు ప్రయత్నించిన ఒక ట్రాక్టర్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న 10 మంది కూలీలు గల్లంతయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch: షాకింగ్‌ వీడియో.. క్షణాల్లో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. 10 మంది గల్లంతు.. ఎక్కడంటే!
Shocking Video
Anand T
|

Updated on: Sep 16, 2025 | 3:03 PM

Share

నది దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో ట్రాక్టర్‌తో పాటు 10 మంది కూలీలు కోట్టుకుపోయిన ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. వైరల్‌ వీడియో ప్రకారం.. కూలీలతో వెళ్తున్న ఒక ట్రాక్టర్‌ ఉదృతంగా ప్రవహిస్తున్న నది దాటేందుకు ప్రయత్నించింది. కానీ అది నది మధ్యలోకి రాగానే ఆగిపోయి బ్రేక్‌ డైన్‌ అయినట్టు తెలుస్తోంది. ఎంతసేపటి ట్రాక్టర్ స్టార్ట్‌ కాకపోవడంతో అందులో ఉన్న కూలీలు కాపాడాలని కేకలు వేయడం ప్రారంభించారు. నది ఒడ్డున ఉన్న కొందరు స్థానికులు వారిని గమనించారు.కానీ అంతలోనే నది ప్రవాహం పెరగడంతో ట్రాక్టర్‌తో అందులో ఉన్న 10 మంది కూలీలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.

నిస్సాయంగా ఒడ్డున నిల్చున్న స్థానికులు

అయితే ఒడ్డున్న ఉన్న స్థానికులు చేసేదేమి లేక నదిలో కొట్టుకుపోతున్న వారిని అలానే చూస్తు ఉండిపోయారు. ఎవరైనా వారిని కాపాడండి అంటే కేకలు వేశారు. అయితే నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వారంతో చనిపోయి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు బాధిత కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.

400 మందిని రక్షించిన సహాయక బృందాలు

ఇదిలా ఉండగా రాత్రంతా కురుస్తున్న భారీ వర్షానికి డెహ్రాడూన్, ముస్సోరీ, మాల్ దేవతా ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయి. డెహ్రాడూన్ ప్రేమ్ నగర్‌లోని లా కాలేజీ సమీపంలోని వంతెన కొట్టుకుపోయింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి దాదాపు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

భారీ వర్షాలపై సీఎం ధామి స్పందన

భారీ వర్షం కారణంగా రాష్ట్రంలోని అన్ని నదులు పొంగిపొర్లుతున్నాయని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. “25 నుండి 30 చోట్ల రోడ్లు తెగిపోయాయి. అప్రోచ్ రోడ్లు తెగిపోయాయి. ఇళ్ళు, ప్రభుత్వ ఆస్తులు దెబ్బతిన్నాయి. సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి రెస్క్యూ బృందాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి” అని ఆయన అన్నారు. “రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బాధిత కుటుంబానికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా