- Telugu News Photo Gallery Cinema photos Actress Sreemukhi Visits Tiruvannamalai Arunachalam Temple, See Photos
అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్న టాలీవుడ్ స్టార్ యాంకర్.. నాలుగు గంటల్లో గిరి ప్రదక్షిణ పూర్తి.. ఫొటోస్ వైరల్
టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో తీరిక లేకుండా గడిపే ఈ టాలీవుడు యాంకరమ్మకు భక్తి భావం ఎక్కువ. అందుకే ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళుతుంటుది. తాజాగా తమిళనాడు వెళ్లిన ఈ అమ్మడు అక్కడి తిరువణ్ణామలైలోని అరుణాచల పరమేశ్వరుడిని దర్శనం చేసుకుంది.
Updated on: Sep 16, 2025 | 10:06 PM

1. టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖికి భక్తి భావం ఎక్కువ. అందుకే కాస్త తీరిక దొరికినా చాలు పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళుతుంటుంది. తాజాగా ఆమె తిరువణ్ణామలై వెళ్లింది.

తమిళనాడులో ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోన్న తిరుమణ్ణామలై అరుణాచలం గుడికి వెళ్లింది శ్రీముఖి. అక్కడి స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేసింది.

అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఉదయం మూడు గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభించగా ఏడు గంటలకల్లా పూర్తయినట్లు అందులో పేర్కొందీ టాలీవుడ్ యాంకరమ్మ.

సుమారు నాలుగు గంటల పాటు శివుని అశీస్సులతో ముందుకు సాగినట్లు శ్రీముఖి రాసుకొచ్చింది. ప్రస్తుతం శ్రీముఖి అరుణాచలం యాత్ర ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి

అంతకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది శ్రీముఖి. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలయ్యాయి.

శ్రీముఖి అరుణాచలం, తిరుమల యాత్రలకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.




