- Telugu News Photo Gallery Cinema photos Shivathmika rajashekar shared her latest saree photos goes viral
Shivathmika Rajashekar: చీరకట్టులో చిలకమ్మలా మెరిసిన శివాత్మిక.. ఫిదా అవుతున్న నెటిజన్స్
సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన శివాత్మిక.. 2019లో దొరసాని సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ తర్వాత మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. దొరసాని తర్వాత తమిళంలో రెండు సినిమాల్లో నటించింది.
Updated on: Sep 17, 2025 | 2:15 PM

సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన శివాత్మిక.. 2019లో దొరసాని సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ తర్వాత మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. దొరసాని తర్వాత తమిళంలో రెండు సినిమాల్లో నటించింది.

కొన్నాళ్లు టాలీవుడ్ నుంచి గ్యాప్ తీసుకున్న ఆమె.. 2022లో పంచతంత్రం, 2023లో రంగమార్తండ సినిమాల్లో మెరిసింది. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటూ నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది. కొన్నాళ్లుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.

మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు ఇన్ స్టాలో సరైన ఫాలోవర్స్ లేకపోవడంతో సినిమాల నుంచి తప్పించారని.. మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కొందరికి అవకాశాలు ఇచ్చారని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఏ మేనేజర్, లేదా ఏజెంట్ ను కలిసినా సరే ఇన్ స్టాలో ఫాలోవర్స్ ను పెంచుకోమంటున్నారని చెప్పుకొచ్చింది. కానీ తాను ఒక నటి అని కంటెంట్ క్రియేట్ చేయడం తన పనికాదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శివాత్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇక ఈ అమ్మడు సినిమాలతో కంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో కత్తిలాంటి ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.