- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips for Home: Where not to keep dead person photos in house according to Vastu Shastra
Vastu Tips: చనిపోయిన వ్యక్తి ఫోటోను ఇంట్లో పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా ? జాగ్రత్త సుమా
హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో పూర్వీకుల ఫోటోను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా తమ పెద్దల ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం వలన ఆ వంశస్తులపై పూర్వీకుల ఆశీస్సులు ఉంటాయి. అయితే మరణించిన వ్యక్తి ఫోటోను ఉంచేటప్పుడు చేసే కొన్ని తప్పులు కుటుంబ సభ్యులకు కూడా హానికరం కావచ్చు.
Updated on: Sep 16, 2025 | 4:36 PM

తరచుగా ప్రజలు తమ ఇళ్లలో మరణించిన తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చిత్రాలను ఉంచుతారు. వాస్తు శాస్త్రంలో పూర్వీకుల చిత్రాలను ఇంట్లో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే, ఇంట్లో పూర్వీకుల చిత్రాలను ఉంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.. వీటిని విస్మరించడం వల్ల దురదృష్టకరమైన ఫలితాలు వస్తాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వ్యక్తి చిత్రపటాన్ని ఇంటి మధ్యలో అంటే బ్రహ్మ స్థానంలో ఉంచకూడదు. పూర్వీకుల చిత్రపటాన్ని మెట్ల కింద లేదా స్టోర్ రూమ్‌లో ఉంచకూడదు. ఈ ప్రదేశాలలో పూర్వీకుల చిత్రపటాన్ని ఉంచడం ద్వారా కుటుంబ సభ్యులు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

కొంతమంది తమ పూర్వీకుల చిత్రాలను పూజ గదిలో ఉంచుతారు. ఇది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా అశుభకరమైన చర్యగా పరిగణించబడుతుంది. ఇంటిలోని పూజ గదిలో పూర్వీకుల చిత్రాలను ఎప్పుడూ ఉంచకూడదు. చనిపోయిన వ్యక్తి ఫోటోను పూజ గదిలో దేవుని విగ్రహం లేదా చిత్రాలతో పాటు కలిపి ఎప్పుడూ ఉంచకూడదు.

చాలా మంది తమ పూర్వీకుల చిత్రాలను ఇళ్ల గోడలపై వేలాడదీస్తారు. ఇలా ఎక్కడ బడితే అక్కడ పెట్టడం కూడా వాస్తు శాస్త్రంలో తప్పుగా పరిగణించబడుతుంది. చనిపోయిన వ్యక్తి ఫోటోను ఎప్పుడూ గోడపై వేలాడదీయకూడదు, బదులుగా పూర్వీకుల చిత్రాలను చెక్క స్టాండ్ లేదా టేబుల్‌పై ఉంచాలి.

వాస్తు ప్రకారం చనిపోయిన వ్యక్తి ఫోటోను ఎల్లప్పుడూ దక్షిణ దిశలోనే ఉంచాలి. అంతేకాదు పూర్వీకుల ఫోటోను ఉత్తర దిశలో కూడా ఉంచవచ్చు. అయితే ఈ దిశలో ఫోటోను ఉంచేటప్పుడు.. వారి ముఖం దక్షిణం వైపు ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని గుర్తుంచుకోండి.

చనిపోయిన వ్యక్తి ఫోటోను బెడ్‌రూమ్‌లో ఎప్పుడూ ఉంచకూడదు. పూర్వీకుల ఫోటోను బెడ్‌రూమ్‌లో ఉంచడం చాలా అశుభకరమని భావిస్తారు. పూర్వీకుల ఫోటోను బెడ్‌రూమ్‌తో పాటు, వంటగదిలో, బాత్రూమ్ సమీపంలో గోడల దగ్గర కూడా ఉంచకూడదు.




