Sankashti Chaturthi: ఈరోజు సంకష్ట చతుర్థి శుభ సమయం, పూజా విధానం.. ఉపవాసం విరమించే సమయం తెలుసుకోండి..
ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, వినాయకుడిని పూజించి, చంద్రోదయ సమయంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తారు. ఈ రోజు చేసే ఉపవాసం, ఆరాధన మానసిక ప్రశాంతత, శ్రేయస్సు , జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది. గణపతి సంకష్టి చతుర్థి వ్రతం చాలా పవిత్రమైనది. విజయాన్ని అందించడమే కాదు సమస్యల నుంచి విముక్తి కోసం చేసే ముఖ్యమైన వ్రతంగా పరిగణించబడుతుంది
విఘ్నాలకధిపతి వినాయకుడిని పూజిస్తూ సంకష్ట చతుర్థి ఉపవాసం చేయడం హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ సంకష్ట చతుర్థి ఉపవాసం గణేశుడికి అంకితం చేయబడింది, గణపతి అడ్డంకులను తొలగించేవాడు.. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టాన్ని ఇచ్చే దేవుడిగా పరిగణిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలోని ఆటంకాలు, కష్టాలు నశిస్తాయి. ఈ పండుగను ప్రతి నెల చతుర్థి రోజున జరుపుకుంటారు. ముఖ్యంగా సంకష్తి చతుర్థిని విఘ్నాలకధిపతి వినాయకుడి ఆశీర్వాదం పొందడానికి, జీవితంలోని అన్ని కష్టాలు, అడ్డంకుల నుంచి విముక్తి పొందడానికి జరుపుకుంటారు.
ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, వినాయకుడిని పూజించి, చంద్రోదయ సమయంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తారు. ఈ రోజు చేసే ఉపవాసం, ఆరాధన మానసిక ప్రశాంతత, శ్రేయస్సు , జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది. గణపతి సంకష్టి చతుర్థి వ్రతం చాలా పవిత్రమైనది. విజయాన్ని అందించడమే కాదు సమస్యల నుంచి విముక్తి కోసం చేసే ముఖ్యమైన వ్రతంగా పరిగణించబడుతుంది.
గణపతి సంకష్ట చతుర్థి 2024 తేదీ, శుభ ముహూర్తం
వేద పంచాంగం ప్రకారం భాద్రప్రద మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ 20వ తేదీ రాత్రి 9.20 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 21వ తేదీ సాయంత్రం 6.15 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం గణపతి సంకష్ట చతుర్థి ఉపవాసం రోజుగా 21వ తేదీ సెప్టెంబర్ 2024 శనివారం రోజున చేస్తారు. ఈ రోజు రాత్రి 8.27 గంటలకు చంద్రోదయం అవుతుంది.
గణపతి సంకష్ట చతుర్థి 2024 పూజ విధి
ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇప్పుడు పూజ స్థలం లేదా ఇంటిలో పూజ గదిని శుభ్రం చేసి గంగాజలం చల్లి శుద్ధి చేయండి. ఇప్పుడు గణేశుడి ముందు ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. ఇప్పుడు ఒక వేదికపై పసుపు వస్త్రాన్ని పరచి వినాయకుడి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించి దీపం ,ధూపం వెలిగించండి .సంకష్ట చతుర్థి రోజున ఉపవాసం సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు చేస్తారు. ఈ ఉపవాస సమయంలో నీరు లేదా పండ్లని తీసుకుంటారు.
దీపం వెలిగించిన అనంతరం గణేశుడికి పసుపు, కుంకుమ, అక్షతలు, దర్భ గడ్డి, పూలు, నైవేద్యాలు (స్వీట్లు, పండ్లు), కొబ్బరి, తమలపాకులు, మోదకాలను సమర్పించండి. గణేశుడికి దర్భ గడ్డిని, మోదకం సమర్పించడం విశేషంగా భావిస్తారు. ఇప్పుడు గణేశుడిని ధ్యానిస్తూ “ఓం గం గణపతయే నమః” అనే మంత్రాన్ని జపించండి. సంకష్టి చతుర్థి కథను చదవండి లేదా వినండి. పూజ అనంతరం గణేశునికి హారతిని ఇచ్చి.. అనంతరం ప్రసాదాన్ని అందరికీ పంచాలి. సాయంత్రం చంద్రోదయం తరువాత చంద్రునికి అర్ఘ్యం సమర్పించి దర్శనం చేసుకోండి. అప్పుడు ఉపవాసం విరమించండి. ఈ రోజు పూజ తర్వాత, బ్రాహ్మణులకు ఆహారం అందించడంతో పాటు పేదలకు దానం చేయడం ముఖ్యంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
గణపతి సంకష్ట చతుర్థి ప్రాముఖ్యత, మహత్వం
గణపతి సంకష్ట చతుర్థి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథిలో పూజలు, ఉపవాసం చేయడం ద్వారా వ్యక్తి చేసిన అన్ని పాపాలు, కష్టాలు తొలగిపోతాయి. జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగి ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా ఈ రోజున చంద్రుడిని చూడటం, చంద్రునికి అర్ఘ్యం సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది మానసిక ప్రశాంతత, శ్రేయస్సును కలిగిస్తుంది. గణపతి సంకష్ట చతుర్థి రోజున చేసే ఉపవాసం ఏదో ఒక రకమైన సమస్య, వ్యాధి లేదా ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ వ్రత ప్రభావంతో భక్తుల కోరికలన్నీ నెరవేరి జీవితంలో విజయాన్ని, శ్రేయస్సును పొందుతారు.
గణపతి సంకష్ట చతుర్థి రోజున ఈ ప్రత్యేక పరిహారాలు చేయండి
అడ్డంకులు, ఇబ్బందులను తొలగించే పరిహారాలు ఈ రోజున “ఓం గం గణపతయే నమః” లేదా “వక్రతుండ మహాకాయ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల అన్ని అడ్డంకులు, ఇబ్బందులు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ జీవితంలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు.
కోరికల నెరవేర్చడానికి చేయాల్సిన నివారణలు వినాయకుడికి ఇష్టమైన దుర్వ గడ్డి, మోదకం సమర్పించడం కూడా చాలా శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల గణేశుడు సంతోషించి తన కోరికలు తీరుస్తాడు.
గణేశుడి అనుగ్రహం పొందే మార్గాలు ఈ రోజు పూజ సమయంలో ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే ఈ రోజున వినాయకుడికి పసుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల వినాయకుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
విద్యార్థులకు పరిష్కారాలు ఎవరైనా విద్యార్థి తన చదువులో ఆటంకాలు ఎదుర్కుంటే, గణేశ విగ్రహం ముందు “సిద్ధి బుద్ధి ప్రదే దేవి” అనే మంత్రాన్ని జపించి గణపతికి మోదకాలను సమర్పించండి. దీనివల్ల తెలివితేటలు, జ్ఞానం పెరుగుతాయి.
రుణ విముక్తికి మార్గాలు రుణ విముక్తి పొందాలనుకుంటే ఈ రోజున గణపతిని పూజించే సమయంలో నువ్వులు, బెల్లం లడ్డూలను సమర్పించి, “రింహర్తా గణేశాయ నమః” అనే మంత్రాన్ని జపించండి.
ఆనందం, శ్రేయస్సు కోసం ఈ రోజున ఆహారం, బట్టలు లేదా డబ్బును అవసరమైన వారికి దానం చేయడం శుభప్రదం అని నమ్ముతారు. ఇలా చేయడం వలన గణేశుడు సంతోషిస్తాడు. జీవితంలో శ్రేయస్సు, ఆనందం, శాంతి ఆశీర్వాదాలు పొందుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి