AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturday puja tips: శనివారం రోజున పొరపాటున కూడా ఈ వస్తువులు కొనొద్దు.. లేదంటే కష్టాలకు వెల్కం చెప్పినట్లే..

శనివారం రోజున చేసే పూజకే కాదు పనులకు కూడా కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. ముఖ్యంగా శనివారం రోజున కొన్ని పనులు చేయడం వలన శనిశ్వరుడికి ఆగ్రహం వస్తుందని పొరపాటున కూడా చేయవద్దు అంటూ నిషేధించారు. అంతేకాదు ఈ రోజున వస్తువులను కొనుగోలు చేసే విషయంలో కూడా నియమాలు ఉన్నాయి.

Saturday puja tips: శనివారం రోజున పొరపాటున కూడా ఈ వస్తువులు కొనొద్దు.. లేదంటే కష్టాలకు వెల్కం చెప్పినట్లే..
Saturday Puja Tips
Surya Kala
|

Updated on: Sep 21, 2024 | 10:45 AM

Share

హిందూ మతంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. శాస్త్రాల ప్రకారం శనివారం శనిశ్వరుడి రోజు. ఈ రోజున కర్మ ప్రదాతకు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. శనివారం రోజున చేసే పూజలతో శనిశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని.. నమ్మకం. అందుకనే శనివారం ఉపవాసం ఉండడమే కాదు.. ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అనేకాదు శనివారం రోజున చేసే పూజకే కాదు పనులకు కూడా కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. ముఖ్యంగా శనివారం రోజున కొన్ని పనులు చేయడం వలన శనిశ్వరుడికి ఆగ్రహం వస్తుందని పొరపాటున కూడా చేయవద్దు అంటూ నిషేధించారు. అంతేకాదు ఈ రోజున వస్తువులను కొనుగోలు చేసే విషయంలో కూడా నియమాలు ఉన్నాయి.

శనివారం రోజున శనిశ్వరుడికి, ఆంజనేయ స్వామికి పూజ చేయడం వలన శనిశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. అయితే శనివారం రోజున కొన్ని వస్తువులను పొరపాటున కూడా కొనవద్దు. ముఖ్యంగా శనివారం రోజున ఇనుము, ఉప్పు వంటి వాటిని అస్సలు కొనకూడదు. ఇలా చేయడం వలన సమస్య మరింత జటిలం అవుతుంది. కనుక శనిశ్వరుడి ఆగ్రహాన్ని నివారించడానికి పూజ మాత్రమే కాదు, వస్తువులను కొనుగోలు చేయడం విషయంలో కూడా కొన్ని ఉపయోగకరమైన నియమాలున్నాయి. వాటిని గుర్తుంచుకోవాలి. శనిశ్వరుడి కోపం నుంచి, సమస్యల నుండి బయటపడటానికి శనివారం రోజున ఎప్పటికీ కొనకూడని వస్తువులు ఏమిటంటే..

శనివారం నాడు ఉప్పు కొనకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ఉప్పు కొనడం అశుభం. ఇలా చేయడం వలన శనిశ్వరుడికి ఆగ్రహం కలుగుతుందని రుణభారం రెట్టింపు అవుతుందని నమ్మకం. అంతేకాదు ఆర్థిక పరిస్థితి క్రమంగా బలహీనపడుతుంది.

ఇవి కూడా చదవండి

శనివారం రోజు ఇనుముతో చేసిన వస్తువులను కొనడం నిషిద్ధం. పురాణ గ్రంధాల ప్రకారం శనివారం నాడు ఇనుప వస్తువులను కొనడం అస్సలు మంచిది కాదు. ఇలా చేయడం వలన శనీశ్వరుడు అసంతృప్తిగా ఉండవచ్చు. ఇంట్లో రోజువారీ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇనుప వస్తువులు శనివారం కాకుండా అది వారం లేదా శుక్రవారం కొనుగోలు చేసి వాటిని ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వలన హాని కలగదు.

జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం శనివారం రోజున కత్తెరలు, కత్తులు కొనకూడదు. ఈ రెండు విషయాలు అశుభమైనవిగా పరిగణించబడతాయి. శనివారం కత్తి లేదా కత్తెర కొనుగోలు చేస్తే జీవితంలో అశాంతి మేఘాలు అలముకుంటాయి. ఆ అశాంతిని వదిలించుకోవటం కష్టమని నమ్ముతారు. కుటుంబంలో మంచి సంబంధాలను కొనసాగించడానికి, ఈ రోజున కత్తెర కొనడం మానుకోవాలి.

శనివారం నాడు శని దేవుడికి నువ్వుల నూనును నైవేద్యంగా పెడతారు. అయితే ఈ రోజున నువ్వుల నూనె కొనడం మానుకోవాలి. నువ్వుల నూనెను శనివారం కొనకూడదు. ఈ నియమాన్ని పాటించకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది. తరచుగా అనారోగ్యం సంభవించవచ్చు.

అంతేకాదు ఈ రోజున నలుపు రంగు బట్టలు, బూట్లు, చెప్పులు, బొగ్గును కొనుగోలు చేయడం కూడా అశుభంగా పరిగణించబడుతుంది.

శనివారం రోజు చీపురు కొనడం కూడా నిషేధించబడింది.

శనివారం ఈ వస్తువులు కొంటే శనీశ్వరుడి దోషం ఏర్పడుతుందని నమ్మకం. ఏదైనా పనులకు అడ్డంకిగా పరిగణించబడుతుంది. ప్రతి పనికి చివరి నిమిషంలో అంతరాయం కలగవచ్చు. కనుక జీవితంలో సమస్యలు రాకుండా ఉండాలంటే శనివారం ఈ వస్తువులను కొనకుండా ఉండండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి