Tirumala Laddu: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి దుమారం.. ఏఆర్ డైరీలో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో.. ఏఆర్ డైరీలో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు చేశారు. డైరీలో ఉన్న పదార్ధాల శాంపిల్స్‌ సేకరించారు. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు ఫుడ్‌సేఫ్టీ అధికారులు .మరోవైపు పళని ఆలయంలో ఏఆర్ డెయిరీ సరఫరా చేసే నెయ్యిని వాడుతున్నారని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పళణి సుబ్రమణ్యం ఆలయంలోని పంచామృతం ప్రసాదంలోనూ ఏఆర్ డెయిరీ నెయ్యినే వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Tirumala Laddu: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి దుమారం.. ఏఆర్ డైరీలో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు
Tirumala Laddus Row
Follow us
Surya Kala

|

Updated on: Sep 21, 2024 | 7:34 AM

తిరుమల లడ్డూ వివాదంపై తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది. తమిళనాడు ఫుడ్ సేప్టీ అధికారులు ఏఆర్ డెయిరీ ఫుడ్స్ కంపెనీలో తనీఖీలు చేశారు. దిండిగల్ లోని ఏఆర్ డైరీలో అధికారులు తనిఖీలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో.. శాంపిల్స్‌ సేకరించారు ఫుడ్‌సేఫ్టీ అధికారులు. శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపారు అధికారులు. తిరుమల తిరుపతి దేవాస్థానం స్వామి వారికి లడ్డుకోసం పంపిన నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ ఈవీ వివరణ ఇవ్వడంతో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది. అలాగే ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసే ఆలయాల ప్రసాదాలను పరిశీలించారు. పంపిణీ చేసే ప్రసాదాలను కూడా నిలిపివేశారు.

మరోవైపు పళని ఆలయంలో ఏఆర్ డెయిరీ సరఫరా చేసే నెయ్యిని వాడుతున్నారని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పళణి సుబ్రమణ్యం ఆలయంలోని పంచామృతం ప్రసాదంలోనూ ఏఆర్ డెయిరీ నెయ్యినే వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఇదంతా తప్పుడు ప్రచారమని.. ఇలాంటి వదంతులు నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేసింది. పళణి సుబ్రమణ్యం ఆలయం పంచామృతంలో ఆవిన్ నెయ్యి వాడుతున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది.

మరోవైపు టీటీడీ నెయ్యి వివాదంపై తమిళనాడుకి చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ వివరణ ఇచ్చింది. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరిందన్నారు. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పామని ఏఆర్ డెయిరీ సంస్థ తెలిపింది. టీటీడీకి అన్ని వివరాలు అందించామంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని క్లారిటీ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఏఆర్ డెయిరీ సంస్థ ప్రకటించింది. తమ సంస్థ నెయ్యిని పరీక్షించామని, ఎలాంటి కల్తీ లేదని రిపోర్టు వచ్చిందని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..