Gold Price: పరుగులు పెడుతోన్న బంగారం ధర.. తులం ఎంత ఉందో తెలుసా?

తగ్గినట్లే తగ్గిన బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతోంది. ఇటీవల పెళ్లిళ్ల సీజన్‌ ముగిసింది. డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గడం ఖాయమని అంతా భావించారు. అయితే మళ్లీ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చిన బంగారం ధరలో మళ్లీ పెరుగుదల కనిపించింది. చాలా రోజుల తర్వాత...

Gold Price: పరుగులు పెడుతోన్న బంగారం ధర.. తులం ఎంత ఉందో తెలుసా?
Gold PricesImage Credit source: Getty Images
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 21, 2024 | 7:07 AM

తగ్గినట్లే తగ్గిన బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతోంది. ఇటీవల పెళ్లిళ్ల సీజన్‌ ముగిసింది. డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గడం ఖాయమని అంతా భావించారు. అయితే మళ్లీ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చిన బంగారం ధరలో మళ్లీ పెరుగుదల కనిపించింది. చాలా రోజుల తర్వాత తులం బంగారం ధర రూ. 75వేలు దాటేసింది. తాజాగా శనివారం బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. మరి ఈరోజు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69,100కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,270 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,860గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 75,120 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో శనివారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68,860గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,120 వద్ద కొనసాగుతోంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,860గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,120 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 68,860గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 75,120గా ఉంది.

తెలుగు రాష్ట్రాల బంగారం ధర ఎలా ఉందంటే..

* హైదరాబాద్‌ విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,860కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,120 వద్ద కొనసాగుతోంది.

* ఇక విజయవాడతో పాటు విశాఖపట్నంలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,860గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,120 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. శనివారం కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో ఢిల్లీతోపాటు, కోల్‌కతా, ముంబయి, జైపూర్ వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 92,600 వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నైతో పాటు కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర గరిష్టంగా రూ. 97,600గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..