iPhone 16: మొబైల్‌ ప్రియులకు బంపర్‌ ఆఫర్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.48,650లకే ఐఫోన్‌ 16

ఆపిల్‌ తాజా iPhone 16 భారతదేశంలో భారీగా తగ్గింపుతో పొందవచ్చు. దీని వలన వినియోగదారులు రూ. 50,000 కంటే తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 9, 2024న జరిగిన ఈవెంట్‌లో ఈ ఐఫోన్‌ 16ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్‌ సేల్‌ 20వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది.ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన..

iPhone 16: మొబైల్‌ ప్రియులకు బంపర్‌ ఆఫర్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.48,650లకే ఐఫోన్‌ 16
Follow us

|

Updated on: Sep 21, 2024 | 2:27 PM

ఆపిల్‌ తాజా iPhone 16 భారతదేశంలో భారీగా తగ్గింపుతో పొందవచ్చు. దీని వలన వినియోగదారులు రూ. 50,000 కంటే తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 9, 2024న జరిగిన ఈవెంట్‌లో ఈ ఐఫోన్‌ 16ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్‌ సేల్‌ 20వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది.ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది.

ఐఫోన్ 16 వేరియంట్‌ 128GB అసలు ధర భారతదేశంలో రూ.79,990, 256GB మోడల్ ధర రూ. 89,990, 512GB మోడల్ ధర రూ. 1,09,990 ఉంది.

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం 128GB iPhone 16 మోడల్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ.48,650 వద్ద అందిస్తోంది. అంటే రూ.50 వేలలోపే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే మీ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల మీరు ఈ ధరకు పొందవచ్చు.

బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు

79,900 రూపాయలకు మీరు Amazonలో ఐఫోన్‌-16 (128GB, అల్ట్రామెరైన్)ని కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 ప్లస్‌ని మంచి కండిషన్‌లో ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా ప్రభావవంతమైన ధరను రూ. 53,650కి తగ్గించవచ్చు. తద్వారా మీకు రూ. 26,250 వరకు ఆదా అవుతుంది. అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు రూ.5,000 తక్షణ తగ్గింపుకు అర్హులు. ఐఫోన్ 16 తుది ధర రూ. 48,650కి తగ్గుతుంది.

ఇదిలా ఉండగా, ఈ ఫోన్‌ సెప్టెంబర్‌ 20 నుంచి సేల్స్‌ ప్రారంభమైంది. కొత్త ఆపిల్‌ ఐ-ఫోన్లు ఎప్పుడు మార్కెట్లోకి వచ్చినా ఐ-ఫోన్‌ ప్రియులు ఎగబడుతుంటారు. ఆ ఫోన్‌ల‌ కోసం ఐ-ఫోన్‌ లవర్స్‌ అంతా క్యూ కట్టారు. ఎలాగైనా ఐ-ఫోన్‌ 16ను సాధించాల్సిందే అన్నట్లుగా గంటలపాటు క్యూ లైన్లో పడిగాపులు కాశారు. అహ్మదాబాద్‌కు చెందిన ఉజ్వల్‌ అనే వ్యక్తి ముంబై ఆపిల్‌ స్టోర్‌ వద్ద ఏకంగా 21 గంటల పాటు క్యూలో నిల్చోని 5 ఐఫోన్‌ 16లను కొనుగోలు చేశాడు. ఈ ఫోన్లు భార్య, పిల్లల కోసం అని చెప్పుకొచ్చాడు. ఐఫోన్‌ అంటే అంత పిచ్చా అనే విధంగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి