Online Shopping: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి.. లేకుంటే మోసపోతారు!
ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇతర ఆన్‌లైన్ వెబ్‌సైట్లు వినియోగదారుల కోసం రకరకాల ఆఫర్లను అందిస్తుంటాయి. ఈనెలలో బిగ్‌బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ పేరుతో ఈ కామర్స్ దిగ్గజాలు ముందుకు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌లకు మొగ్గు చూపుతున్నారు..
ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇతర ఆన్‌లైన్ వెబ్‌సైట్లు వినియోగదారుల కోసం రకరకాల ఆఫర్లను అందిస్తుంటాయి. ఈనెలలో బిగ్‌బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ పేరుతో ఈ కామర్స్ దిగ్గజాలు ముందుకు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌లకు మొగ్గు చూపుతున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆన్‌లైన్ వెబ్‌సైట్లు సైతం ఆఫర్ల మీద ఆఫర్లను అందిస్తున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. లేకపోతే మోసపోయే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
కొన్ని టిప్స్ పాటిస్తే ఎంతో మంచిది. మీరు ఏవైనా వస్తువులు కొనాలనుకుంటే సేల్ కన్నా ముందే వాటిని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సేల్ కన్నా ముందు వాటి ధరలు ఎంత ఉన్నాయో, సేల్ సమయంలో ఎంత ఉన్నాయో ట్రాక్ చేయడం మంచిది. కొన్ని వస్తువుల ధరలు సేల్ సమయంలో కూడా తగ్గవు. అలాంటప్పుడు మీరు సేల్ వరకు ఎదురు చూడటం వృథానే అవుతుంది.
యాడ్స్‌ను చూసి నమ్మొద్దు..:
మీరు నేరుగాసేల్ సమయంలోనే మీకు కావాల్సిన ప్రొడక్ట్ సెర్చ్ చేస్తే అప్పుడు ధర తగ్గిందా లేదా అన్న విషయం తెలియదు. అందుకే ముందు నుంచే ట్రాక్ చేయడం బెటర్. ఇ-కామర్స్ సైట్‌లో కనిపించే డిస్కౌంట్లను పూర్తిగా నమ్మకూడదు. 50 శాతం, 60 శాతం, ఒక్కోసారి 90 శాతం డిస్కౌంట్ అని యాడ్స్ కనిపిస్తాయి. స్క్రీన్‌లపై కనిపిస్తున్న డిస్కౌంట్స్ చూసి మోసపోకూడదు. మీరు కొనాలనుకునే వస్తువు ధర ఎంత ఉంటుందో మీకు ఓ ఐడియా ఉండాలి.
అంతకన్నా తక్కువకే ఆ వస్తువు లభిస్తే కొనాలి. అంతే తప్ప డిస్కౌంట్స్ చూడకూడదు. మీరు ధరలను చాలాకాలంగా ట్రాక్ చేస్తూ ఉంటే సేల్ సమయంలో ఆ వస్తువు ధర తక్కువ ఉందో ఎక్కువ ఉందో తెలుస్తుంది.
బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి:
ప్రస్తుతం డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్‌కే అలవాటు పడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం అనేది సాధారణంగా మారిపోయింది. అయితే ఆన్‌లైన్‌లో షాపింగ్‌లు చేస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తలెత్త అవకాశం ఉందని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువుల ధరలను ట్రాక్ చేసేందుకు వెబ్‌సైట్స్, యాప్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు.
మీరు కొనాలనుకునే వస్తువులను విష్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. ఆ ప్రొడక్ట్స్‌కి సంబంధించి ఆఫర్స్ ఉంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు కొనే వస్తువులకు బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి.
డిస్కౌంట్లు:
అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో వివిధ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ ఉపయోగించుకుంటే లాభమే.
ధరల విషయంలో..:
కొన్ని ప్రొడక్ట్స్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభిస్తాయి. మరికొన్ని ప్రోడక్ట్స్ అమెజాన్‌లో లభిస్తాయి. కానీ చాలావరకు ప్రొడక్ట్స్ రెండు వెబ్‌సైట్లలో లభిస్తాయి. ధర ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనాలి. ఉదాహరణకు చెప్పాలంటే.. మీరు వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటే పెద్దపెద్ద బ్రాండ్స్ ఆన్‌లైన్‌లో అమ్ముతుంటాయి. బ్రాండ్స్ వేర్వేరు అయినా ఫీచర్స్ ఒకేలా ఉంటాయి. ఆన్‌లైన్ షాపింగ్ ఓ వ్యసనం లాంటిదన్న విషయం గుర్తుంచుకోవాలి.
ఈ వ్యసనంలో పడి అవసరం లేని వస్తువులు కూడా కొనుగోలు చేయకూడదు. అవసరం లేని వస్తువులు కొంటూ పోతే జీవితంలో ఏదో ఓ దశలో అవసరం ఉన్న వస్తువుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయం గుర్తించుకోవాలి.
ఇది కూడా చదవండి: Gold Rates: వామ్మో.. తగ్గేదిలే అంటున్న బంగారం ధర.. సాయంత్రానికే ఇంత పెరిగిందా? ఎంతో తెలిస్తే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి