iPhone 17: రాబోయే ఐఫోన్‌ 17 ఎలా ఉండనుంది? 16 సిరీస్‌ కంటే బెస్ట్‌ ఫీచర్స్‌ ఉండనున్నాయా?

ఐఫోన్ 16 సిరీస్ విక్రయం సెప్టెంబర్ 20 నుండి ఆపిల్ స్టోర్, వెబ్‌సైట్, ఇ-కామర్స్‌లో ప్రారంభమవుతుంది. తాజా సిరీస్‌లో 4 మోడళ్లు ఉన్నాయి. iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max. ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్‌తో వస్తున్న iOS 18తో కూడిన మొదటి సిరీస్ ఇదే. 16 సిరీస్ గ్లోబల్ మార్కెట్లోకి రాకముందే వచ్చే ఏడాది ఐఫోన్ 17 గురించి పుకార్లు షికార్లు అవుతున్నాయి..

iPhone 17: రాబోయే ఐఫోన్‌ 17 ఎలా ఉండనుంది? 16 సిరీస్‌ కంటే బెస్ట్‌ ఫీచర్స్‌ ఉండనున్నాయా?
Follow us
Subhash Goud

|

Updated on: Sep 19, 2024 | 3:36 PM

ఐఫోన్ 16 సిరీస్ విక్రయం సెప్టెంబర్ 20 నుండి ఆపిల్ స్టోర్, వెబ్‌సైట్, ఇ-కామర్స్‌లో ప్రారంభమవుతుంది. తాజా సిరీస్‌లో 4 మోడళ్లు ఉన్నాయి. iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max. ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్‌తో వస్తున్న iOS 18తో కూడిన మొదటి సిరీస్ ఇదే. 16 సిరీస్ గ్లోబల్ మార్కెట్లోకి రాకముందే వచ్చే ఏడాది ఐఫోన్ 17 గురించి పుకార్లు షికార్లు అవుతున్నాయి. అయితే ఇందులో ఏదైనా పెద్ద మార్పు కనిపిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. వెలువడుతున్న పుకార్ల ప్రకారం, iPhone 16 కంటే iPhone 17 ఎక్కువ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది.

iPhone 16 లేదా iPhone 17?

ఐఫోన్ 17 సిరీస్‌లోని ప్లస్ మోడల్‌ను కంపెనీ తొలగించే అవకాశం ఉంది. ఇక్కడ ఐఫోన్ 16, రాబోయే 17 సిరీస్‌ల మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం. ప్రస్తుతానికి, iPhone 17కి సంబంధించి Apple ద్వారా ఎలాంటి ప్రకటన బయటకు రాలేదు. కానీ పుకార్ల ఆధారంగా తదుపరి సిరీస్ ప్రస్తుత సిరీస్ కంటే మెరుగ్గా ఉంటుందా లేదా అనేది ఊహించవచ్చు.

ఐఫోన్ 16 సిరీస్‌లో చాలా ఇష్టపడే ప్రధాన మార్పు దాని డిజైన్. ఐఫోన్ 16 బేస్ మోడల్ కొత్త రూపాన్ని అందించింది కంపెనీ. ఐఫోన్ 16, 16 ప్లస్ రెండూ క్యాప్సూల్ మాడ్యూల్‌లో ఉన్న వెనుక ప్యానెల్‌లో నిలువు కెమెరాను కలిగి ఉన్నాయి. అయితే ఐఫోన్ 16 ప్రో మోడల్ డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదు. పుకార్ల ప్రకారం, ఐఫోన్ 17 ప్రో మోడల్స్ కూడా అదే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఐఫోన్ 17 ఎలా ఉంటుంది?

లీక్‌ల ప్రకారం.. టిప్‌స్టర్‌లు తమ X హ్యాండిల్‌లో ఐఫోన్ 17 ప్రో మోడల్ సాధ్యమైన ఫోటోను పంచుకున్నారు. ఫోటోలో iPhone 17 వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా, ఈ ఫోన్‌లు వేర్వేరు రంగులలో ఉంది. దీని నుండి Apple iPhone 17 తో కలర్ గేమ్‌ను కొనసాగిస్తుందని ఊహించవచ్చు. ప్రతిసారీ మాదిరిగానే, ఆపిల్ కొత్త సిరీస్‌లను కొత్త కలర్స్‌లో తీసుకురావచ్చు. ఫోటోలో కనిపించే ఐఫోన్ 17 ప్రో రంగులు టైటానియం బ్లూ మెటాలిక్, టైటానియం గ్రీన్, టైటానియం పర్పుల్.

iOS 18.1 అప్‌డేట్‌:

ఇది కాకుండా ఐఫోన్ 17 ఎయిర్ లేదా స్లిమ్‌గా ఉండే అవకాశం ఉంది. దాని ప్రాసెసర్‌లో అప్‌గ్రేడ్ కూడా చూడవచ్చు. ఇది మాత్రమే కాదు, Apple WWDC 2024లో 16 సిరీస్‌లలో అందించగల కొన్ని ఫీచర్లు, అప్‌డేట్‌ల గురించి పరిశీలిస్తే.. ఆ అప్‌గ్రేడ్‌లు 16 సిరీస్‌లలో రాలేదు. కంపెనీ రాబోయే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో iOS 18.1 అందించనున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. రాబోయే కాలంలో Genmoji, రైటింగ్ టూల్స్, Siri ఓవర్‌హాల్, ChatGPT వంటి అప్‌డేట్‌లు ఉండే అవకాశం ఉంది. ఇలా ఐఫోన్ 17 గురించి సోషల్ మీడియాలో అనేక పుకార్లు వెలువడుతున్నాయి. మరి ఇవి నిజమా? కాదా? అని తెలుసుకోవాలంటే ఆపిల్ కంపెనీ ప్రకటన కోసం ఎదురు చూడాల్సిందే.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి