AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: వామ్మో.. తగ్గేదిలే అంటున్న బంగారం ధర.. సాయంత్రానికే ఇంత పెరిగిందా? ఎంతో తెలిస్తే..

బంగారంలో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రిస్క్ లేని పెట్టుబడి. సెప్టెంబర్ 20న బంగారం ధర భారీగా పెరిగింది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2200 పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఈరోజు బంగారం ధరలో విపరీతమైన పెరుగుదల..

Gold Rates: వామ్మో.. తగ్గేదిలే అంటున్న బంగారం ధర.. సాయంత్రానికే ఇంత పెరిగిందా? ఎంతో తెలిస్తే..
Subhash Goud
|

Updated on: Sep 20, 2024 | 6:15 PM

Share

బంగారంలో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రిస్క్ లేని పెట్టుబడి. సెప్టెంబర్ 20న బంగారం ధర భారీగా పెరిగింది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2200 పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఈరోజు బంగారం ధరలో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. అయితే సెప్టెంబర్‌ 20వ తేదీ ఉదయం 6 గంటల సమయానికి కంటే సాయంత్రం 6 గంటల వరకు భారీగా పెరిగింది. తులం బంగారంపై దాదాపు 1200 వరకు ఎగబాకింది.

ఇది కూడా చదవండి: Dussehra Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దసరా సెలవులు ఎప్పటి నుంచో తెలుసా?

☛ చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 68,850 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల ధరను చూస్తే 75,110 రూపాయల వద్ద కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

☛ ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 69,000 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 75,260 రూపాయల వద్ద నమోదైంది.

☛ ఇక ముంబైలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర 68,850 రూపాయల వద్ద ఉండగా, అదే 24 క్యారెట్ల ధర 75,110 వద్ద ఉంది.

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 68,850 రూపాయల వద్ద ఉండగా, 24 క్యారెట్ల ధర 75,110 వద్ద కొనసాగుతోంది.

☛ ఇక బంగారం ధర మాదిరిగానే వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. కిలో వెండిపై ఏకంగా 1500 వరకు ఎగబాకింది. ప్రస్తుతం సెప్టెంబర్‌ 20వ తేదీన సాయంత్రం 6 గంటల సమయానికి 92,500 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీగా ఉంది. లక్ష చేరువలో ఉంది. చెన్నై, హైదరాబాద్‌, కేరళలో రూ.97,000 ఉంది.

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. అమెరికా ప్రభుత్వం వడ్డీ రేట్లను తగ్గించడమే ఇందుకు కారణం. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు, ప్రజలు తమ డబ్బు సురక్షితంగా ఉంటుందని భావించి బంగారం కొనడానికి ఇష్టపడతారు.

బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణం ఉంది. అటువంటి సమయంలో ప్రజలు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. అయితే గత నెలలో బంగారం దిగుమతిని తగ్గించింది.

బంగారం ఇప్పుడు మరింత ఖరీదు అవుతుందా?

అన్నీ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అనుకూలమైన మార్కెట్ పరిస్థితులు కొనసాగితే తదుపరి 12 నెలల్లో ధరలు $2,600, $2,800 మధ్య చేరవచ్చు. బంగారం ఇప్పుడు చాలా ఖరీదైనది. ప్రజలు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తున్నందున మరింత ఖరీదైనదిగా మారవచ్చు.

మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి ధర తెలుసుకోండి:

బంగారం ధర ఎంతో తెలుసుకోవాలంటే 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. మిస్ట్ కాల్ చేసిన కొద్దిసేపటికే రేట్లు SMS ద్వారా వస్తుంది. బంగారం లేదా వెండి ధరను తెలుసుకోవడానికి, మీరు www.ibja.co లేదా ibjarates.comని కూడా సందర్శించవచ్చు.

ఇది కూడా చదవండి: ఓర్నీ.. ఇదేం ఆఫర్రా నాయనా.. కేవలం రూ.179కే Motorola G85 5Gఫోన్‌.. 99 శాతం క్యాష్‌ బ్యాక్‌.. కట్‌ చేస్తే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి