- Telugu News Photo Gallery Business photos Mukesh ambani buys indias most expensive first boeing private jet check the worth and details in telugu
Mukesh Ambani: అంబానీ వద్ద దేశంలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్.. ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే!
దేశంలోనే రెండో అతిపెద్ద బిలియనీర్ అయిన ముఖేష్ అంబానీ విలాసవంతమైన జీవితానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచూ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. యాంటిలియాలో అంబానీ కుటుంబం నివసించే ఇల్లు ప్రపంచంలోనే..
Updated on: Sep 20, 2024 | 7:51 PM

దేశంలోనే రెండో అతిపెద్ద బిలియనీర్ అయిన ముఖేష్ అంబానీ విలాసవంతమైన జీవితానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచూ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. యాంటిలియాలో అంబానీ కుటుంబం నివసించే ఇల్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. ఇలాంటి ధనికుల గురించి తెలుసుకోవాలని చాలా మంది ఉంటాయి. ఇలాగే అంబానీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది.

ముఖేష్ అంబానీకి ప్రైవేట్ జెట్‌లు, కార్లు, ఇళ్లు, హెలికాప్టర్లు వంటి అనేక విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ఇలాంటి వాటిలో కొత్త అథిది వచ్చి చేరింది. ముఖేష్ అంబానీ ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి బోయింగ్ 737 మ్యాక్స్ 9 జెట్‌ను కొనుగోలు చేశారు.

అంబానీ ఇటీవల కొనుగోలు చేసిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 ధర వింటే ఆశ్చర్యపోవాల్సిందే. అక్షరాల $118.5 మిలియన్లు. అంటే దాదాపు 987 కోట్ల రూపాయలు. దీనితో బోయింగ్ 737 మ్యాక్స్ 9 దేశంలోని అత్యంత ఖరీదైన విమానాలలో ఒకటిగా మారింది.

బోయింగ్ 737 మ్యాక్స్ 9 దాని ముందున్న బోయింగ్ మ్యాక్స్ 8తో పోలిస్తే విస్తృత క్యాబిన్‌ను కలిగి ఉంది. రెండు CFMI లీప్-1B ఇంజిన్‌లతో ఆధారితమైన, జెట్ 8401 6,355 నాటికల్ మైళ్లు (11,770 కిమీ/గం) ప్రయాణ వేగం కలిగి ఉంది. ప్రయాణీకులకు వేగం, లగ్జరీని అందిస్తూ, జెట్ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రైవేట్ జెట్‌లలో ఒకటిగా ఉంది.

కొత్తగా కొనుగోలు చేసిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 కాకుండా, ముఖేష్ అంబానీకి మరో తొమ్మిది ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. అంబానీ జెట్ సేకరణలో బొంబార్డియర్ గ్లోబల్ 6000, రెండు ఫాల్కన్ 900 జెట్‌లు, ఎంబ్రేయర్ ERJ-135 ఉన్నాయి.




