- Telugu News Photo Gallery Business photos How much gold can you keep at home and how much can keep a married women check the details in telugu
Gold: ఒక మహిళా వద్ద ఎంత బంగారం ఉండాలో తెలుసా? ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఏంటి?
ఈ రోజుల్లో బంగారం లేనివారంటూ ఉండరేమో. ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో కొంత బంగారం ఉండటనే ఉంటుంది. ఇంకొందరికైతే తులాలకొద్ది బంగారం ఉంటుంది. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. భారతీయ కుటుంబాల్లో బంగారం పెట్టుబడి సాధనం. బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి..
Updated on: Sep 21, 2024 | 6:30 PM

ఈ రోజుల్లో బంగారం లేనివారంటూ ఉండరేమో. ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో కొంత బంగారం ఉండటనే ఉంటుంది. ఇంకొందరికైతే తులాలకొద్ది బంగారం ఉంటుంది. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. భారతీయ కుటుంబాల్లో బంగారం పెట్టుబడి సాధనం. బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి.

మీరు ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చో పరిమితి ఉంది. పరిమితికి మించి బంగారం ఉంచుకున్న ఆదాయపు పన్ను శాఖ వివరాలు అడగవచ్చు. ఎందుకంటే దేశంలో ఎవరి వద్ద ఎంత బంగారం ఉండాలన్న నిబంధన ఉంది. ఇలాంటి అంశాలపై ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక నిఘా ఉంచుతుంది.

ఒంటరి మహిళకు 250 గ్రాములు, అవివాహిత వ్యక్తికి 100 గ్రాములు, వివాహిత మహిళకు 500 గ్రాములు, వివాహితుడైన వ్యక్తికి 100 గ్రాములు బంగారం ఉండేందుకు చట్టం అనుమతి ఇస్తుంది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, అధికారులు దాడులు లేదా ఇతరత్రా దొరికిన నగలు లేదా బంగారాన్ని, అది పరిమితికి దిగువన ఉంటే జప్తు చేయరాదు. నిబంధనలకు విరుద్దంగా ఉంటేనే జప్తు చేసే అధికారం ఉంది.

బంగారం లేదా ఆభరణాలను వ్యవసాయం, గృహ పొదుపులు లేదా చట్టపరమైన వారసత్వం వంటి బహిర్గత ఆదాయ వనరులను ఉపయోగించి కొనుగోలు చేస్తే, అది పన్ను పరిధిలోకి రాదు.




