Health Insurance: ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..? ఆ విషయాల్లో జాగ్రత్తలు మస్ట్..!
ఇటీవల కాలంలో పెరుగుతున్న ఆస్పత్రి ఖర్చులు సగటు మధ్యతరగతి ఉద్యోగిని భయపెడుతున్నాయి. ఏళ్లుగా పొదుపు చేసుకున్న సొమ్ము అనారోగ్యం వస్తే చిటికెలో ఖర్చయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా తీసుకుంటే పొదుపు ఖర్చు కాకుండానే అనారోగ్యం సమయంలో వైద్యం తీసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే మార్కెట్‌లో ఇబ్బడిముబ్బడిగా ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇన్ని పాలసీల్లో ఏ పాలసీ తీసుకోవాలో? తెలియక చాలా మంది తికమకపడుతూ ఉంటారు. అయితే పాలసీ తీసుకునే సమయంలో చేసే తప్పులు పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.