AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: ఒకే రోజు ఏడు వాహనాల్లో విహరించనున్న శ్రీవారు.. మినీ బ్రహ్మోత్సవం ఎప్పుడంటే..

పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదంటే మాఘ సప్తమి గా పరిగణిస్తారు. ఈ పవిత్రమైన రోజున సూర్య  జ‌న్మించాడ‌ని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్ర‌సాదించాడ‌ని వేదాలు స్పష్టం చేస్తోంది. ఈ రథ‌సప్తమి ప‌ర్వ‌దినాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. రథ సప్తమికి తిరుమలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది.

Tirumala: ఒకే రోజు ఏడు వాహనాల్లో విహరించనున్న శ్రీవారు.. మినీ బ్రహ్మోత్సవం ఎప్పుడంటే..
Ratha Saptami 2024
Raju M P R
| Edited By: Surya Kala|

Updated on: Jan 31, 2024 | 8:22 AM

Share

నవ గ్రహాలకు అధినేత సూర్యుడి జన్మ దినం మాఘమాసం శుద్ధ సప్తమిని రథ సప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు సూర్యభగవానానుడిని పూజిస్తారు.  తిరుమల తిరుపతి క్షేత్రంలో కూడా రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. సూర్య జయంతి రోజున తిరుమల శ్రీవారు ఏడు వాహనాలపై దర్శనం ఇవ్వనున్నారు. ఫిబ్ర‌వరి 16న ఈ వేడుక తిరుమ‌లలో జరగనుంది. రథసప్తమి పర్వదినం రోజు ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదంటే మాఘ సప్తమి గా పరిగణిస్తారు. ఈ పవిత్రమైన రోజున సూర్య  జ‌న్మించాడ‌ని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్ర‌సాదించాడ‌ని వేదాలు స్పష్టం చేస్తోంది. ఈ రథ‌సప్తమి ప‌ర్వ‌దినాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. రథ సప్తమికి తిరుమలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ర‌థ‌సప్తమిని మినీ బ్రహ్మోత్సవాలుగా పరిగణించే టీటీడీ వివిధ వాహన సేవలను నిర్వహిస్తోంది.

ఒకే రోజున ఏడు వాహనాల్లో విహరించనున్న శ్రీవారు

  1. ఫిబ్రవరి 16న  తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంలో శ్రీవారి ఊరేగనున్నారు.
  2. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవ జరపనున్నారు.
  3. ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం నిర్వహించనుంది.
  4. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం సేవ
  5. ఇవి కూడా చదవండి
  6. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం నిర్వహించనుంది టీటీడీ
  7. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై మాడ వీధుల్లో మలయప్ప స్వామి ఊరేగనున్నారు.
  8. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం సేవ
  9. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం పై శ్రీదేవి భూదేవి సమాహిత మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

    రథసప్తమి పర్వదినం నేపథ్యంలో టీటీడీ ఫిబ్రవరి 16వ తేదీన ఆర్జిత సేవలను రద్దు చేసింది. ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్లు వెల్లడించింది. అయితే సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన ఏకాంతంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..