Durga Devi Puja: జాతకంలో గ్రహ దోషమా.. దుర్గాదేవిని ఇలా పూజించి చూడండి.. శుభఫలితాలు మీసొంతం..

జాతకంలో గ్రహదోషం ఉండి.. ఎంత కష్టపడినా చేస్తున్నా.. తగిన ఫలితం దక్కకున్నా..  పనిలో సక్సెస్ అవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయి.. ..  ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే.. తరచుగా అనారోగ్యం బారిన పడితే.. అటువంటి వారు దుర్గాదేవిని పూజించడం ఫలవంతం. ఈ రోజు దుర్గ దేవిని ఎలా పూజిస్తే జాతకంలో గ్రహ దోషం తొలగి సుఖ సంతోషాలు నెలకొంటాయో తెలుసుకుందాం.. 

Durga Devi Puja: జాతకంలో గ్రహ దోషమా.. దుర్గాదేవిని ఇలా పూజించి చూడండి.. శుభఫలితాలు మీసొంతం..
Durgadevi Puja
Follow us
Surya Kala

|

Updated on: Jan 31, 2024 | 9:55 AM

హిందూ మతంలో దుర్గాదేవికి ప్రత్యేక స్థానం ఉంది. ఆదిపరాశక్తిగా భావించి పూజిస్తారు. ఆ తల్లి అనుగ్రహం కలిగితే వ్యాధులు, బాధల నుండి విముక్తి కలుగుతుంది. దుర్గాదేవిని మూడు లోకాలకు మూలపుటమ్మగా పూజిస్తారు. అమ్మవారిని పూజించిన వారికి ఎటువంటి కష్ట, నష్టాలు ఎదురుకావని నమ్ముతారు. దుర్గా దేవిని ఆరాధించడం వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం. దుర్గాదేవి ఆరాధన త్వరగా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. దుర్గామాతను నిర్మల మైన  హృదయంతో పూర్ణ భక్తితో పూజిస్తే, ఆరాధన ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుందని నమ్ముతారు. దుర్గాదేవికి సంబంధించి అనేక మంత్రాలున్నాయి. ఇవి భక్తులకు క్షేమాన్ని కలిగిస్థాయి. వ్యాధులు, దుఃఖాల నుండి ఉపశమనం ఇస్తాయి.

జాతకంలో గ్రహదోషం ఉండి.. ఎంత కష్టపడినా చేస్తున్నా.. తగిన ఫలితం దక్కకున్నా..  పనిలో సక్సెస్ అవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయి.. ..  ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే.. తరచుగా అనారోగ్యం బారిన పడితే.. అటువంటి వారు దుర్గాదేవిని పూజించడం ఫలవంతం. ఈ రోజు దుర్గ దేవిని ఎలా పూజిస్తే జాతకంలో గ్రహ దోషం తొలగి సుఖ సంతోషాలు నెలకొంటాయో తెలుసుకుందాం..

దుర్గాదేవిని పూజించాల్సిన విధానం ఏమిటంటే.. నిర్మలమైన మనస్సు.. దుర్గాదేవిని పూజించడానికి ముందు.. శరీరంతో పాటు మనస్సును శుద్ధి చేసుకోవాలి.  నిర్మలమైన మనస్సుతో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా పూజకు సిద్ధం అవ్వాలి. భగవంతుడు అన్ని జీవుల్లో ఉన్నాడని విశ్వసించండి. అసూయ లేదా ద్వేష భావాలను విడిచి అందరి పట్ల ప్రేమతో మెలగాలి.

ఇవి కూడా చదవండి

స్త్రీలను గౌరవించండి : స్త్రీలను గౌరవించని వారికి దుర్గామాతను పూజించడం వల్ల ప్రయోజనం ఉండదు. తల్లిని, భార్యను, సోదరిని, కుమార్తెను, కోడలుతో పాటు స్త్రీలందరినీ గౌరవించండి. అప్పుడే దుర్గా దేవిని పూజించిన పూర్తి ఫలితాన్ని  పొందుతారు.

శుక్రవారం నుండి దుర్గా పూజ ప్రారంభించండి: శుక్రవారం నుండి దుర్గాదేవిని పూజించడం ప్రారంభించండి. శుక్రవారం ఆడపిల్లలకు ఆహారాన్ని అందించండి.  డబ్బు లేదా పండ్లును ఇవ్వండి. ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత ఇంటిలోని పూజ గదిలో దేశీ నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారిని పూజించండి.

జపించాల్సిన మంత్రం:   “ఓం హ్రీం దుం దుర్గాయై నమః” అనే మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించండి. అయితే ఈ మంత్రాన్ని జపించే సమయంలో నేల మీద కూర్చోకుండా.. ఏదైనా ఆసనం మీద కూర్చోండి.    మంత్రాన్ని జపించడానికి తులసి లేదా గంధపు జపమాల ఉపయోగించండి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి తూర్పు ముఖంగా మంత్రాన్ని జపించాలి. మంత్రాన్ని జపించడానికి ఉదయం ఉత్తమ సమయం.. అయితే ఉదయం మంత్రాన్ని జపించలేకపోతే..  సాయంత్రం సమయంలో నైనా మంత్రాన్ని జపించవచ్చు. సాయంత్రం మంత్రాన్ని జపిస్తే, పడమర ముఖంగా కూర్చోండి. కనీసం 40 రోజుల పాటు మంత్రాన్ని నిరంతరం జపించండి. అదృష్టానికి మూసిన తలుపులు తెరుచుకుంటాయి. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి.

ఓం హ్రీం దుం దుర్గాయై నమః అనే ఈ మంత్రాన్ని  కనీసం 40 రోజుల పాటు  జపించాలని పండితులు చెబుతున్నారు. ఈ మంత్రం 108 సార్లు జపించడానికి 5 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది. అయితే అది మీ అదృష్టాన్ని మారుస్తుంది. దుర్గాదేవిని పూజించే సమయంలో ఎలాంటి తప్పు చేయవద్దు. పూర్ణ భక్తితో దుర్గాదేవిని పూజించండి.

శుక్రవారం ఉదయాన్నే స్నానం చేసిన అనంతరం దుర్గాదేవి ఆలయానికి వెళ్లి.. అక్కడ దుర్గాదేవిని పూజించి ఆలయంలో  ఓం దౌర్భాగ్య నాశిని దుం దుర్గాయై నమః” అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి.

అమ్మవారిని నైవేద్యం పెట్టి నెయ్యి దీపం వెలిగించి భక్తితో పూజించండి. అనంతరం ఆ నైవేద్యాన్ని కుక్కకు ఆహారంగా అందించండి. ఈ పరిహారం దురదృష్టాన్ని తొలగిస్తుందని .. అదృష్టం తలుపు తడుతుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!