Makar Sankranthi 2022: సంక్రాంతి రోజున గుమ్మడికాయను సమర్పిస్తే.. కోరిన కోరికలు తీర్చే వీరభద్రుడు ఎక్కడో తెలుసా..
Makar Sankranthi 2022: సహజంగా ఏదైనా గుడికెళితే కొబ్బరికాయ కొడతాం.. మేడారం వెళ్ళితే బెల్లం నైవేద్యంగా సమర్పిస్తాం కానీ సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ఆ జాతరలో..
Makar Sankranthi 2022: సహజంగా ఏదైనా గుడికెళితే కొబ్బరికాయ కొడతాం.. మేడారం వెళ్ళితే బెల్లం నైవేద్యంగా సమర్పిస్తాం కానీ సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ఆ జాతరలో మాత్రం గుమ్మడికాయలే మహా నైవేద్యం… కోరికలు నెరవేరాలంటే కోరమీసాల వీరభద్రుడికి వెండి కోరమీసాలతో పాటు, గుమ్మడి కాయ కానుకగా సమర్పించు కోవాలి…
చూశారు కదా.. నెత్తిన గుమ్మడికాయతో తరలివస్తున్న భక్తులను… ఇదే హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ ప్రత్యేకత.. సంక్రాంతి సందర్భంగా రెండు రోజుల పాటు ఇక్కడ మహా వైభవంగా జాతర జరుగుతుంది.. ఈ జాతరకు ఈరగోళలు, శివసత్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.. ప్రముఖులు, VIP లు కూడా సంక్రాంతి సందర్భంగా జాతరకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.. ఎలాంటి వారైనాసరే కోరికలు నెరవేరాలంటే కోరామీసాల వీరభద్రుడికి రాచగుమ్మడి కాయను కానుకగా సమర్పించాలి. కొత్తకొండ వీరబాద్రుడి జాతర లో గుమ్మడికాయ మొక్కల అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Also Read: