Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti Special: సంక్రాంతి స్పెషల్ ఫుడ్.. అమ్మమ్మ కాలం నాటి అరిసెలు తయారీ.. ఆరోగ్య ప్రయోజనాలు..

Sankranti Special Food Ariselu: సంక్రాంతి శీతాకాలంలో వచ్చే పండగ. అన్నాదాత తాను పండించిన పంటను ఇంటికి తెచ్చుకుని సంతోషంగా జరుపుకునే అతి పెద్ద పండగ. ఇక సంక్రాంతి (sankranti) అనగానే..

Sankranti Special: సంక్రాంతి స్పెషల్ ఫుడ్.. అమ్మమ్మ కాలం నాటి అరిసెలు తయారీ.. ఆరోగ్య ప్రయోజనాలు..
Andhra Special Ariselu Recipe
Follow us
Surya Kala

|

Updated on: Jan 14, 2022 | 11:51 AM

Sankranti Special Food Ariselu: సంక్రాంతి శీతాకాలంలో వచ్చే పండగ. అన్నాదాత తాను పండించిన పంటను ఇంటికి తెచ్చుకుని సంతోషంగా జరుపుకునే అతి పెద్ద పండగ. ఇక సంక్రాంతి (sankranti) అనగానే ముందుగా అందరికి గుర్తుకొచ్చేది.. ముగ్గులు, గోబెమ్మలు, కొత్త అల్లుల్లు, కోడి పందాలు.. వీటితో పాటు.. ప్రతి ఇంట్లోనూ ఘుమఘుమలాడే సంప్రదాయపు పిండి వంటలు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పిండి వంటలు ఎక్కువగా బియ్యం పిండి, బెల్లం, మినుములతో చేసిన రకరకాల పిండివంటలు ఈ పండగలో ప్రముఖంగా కనిపిస్తాయి. ముఖ్యంగా సంక్రాంతి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది.. అరిసెలు. అసలు అరిసెలు(Ariselu) లేని తెలుగువారి ఇంటిలో సంక్రాంతి ఉండదు. అంటే అతిశయోక్తి కాదు. ఈరోజు అరిసెల తయారీ విధానం తెలుసుకుందాం..

కావలిసిన పదార్ధాలు:

రేషన్ బియ్యం పావుకిలో బియ్యం బెల్లం పావు కిలో బెల్లం చక్కర -2 టేబుల్ స్పూన్లు నెయ్యి – నువ్వులు నూనే

తయారీ విధానం: ముందుగా బియ్యం శుభ్రం చేసుకుని.. వాటిని ఒక రాత్రి ముందుగా నీటిలో నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే రోజున ఆ బియ్యం కడిగి.. రోట్లో మెత్తని పిండిగా దంచుకోవాలి. (మరపట్టిస్తే.. దానిని జల్లించుకుని మెత్తని పిండి)ని తీసుకోవాలి. ఇపుడు స్టౌవ్ మీద దళసరి గిన్నె పెట్టి.. దానిలో మెత్తని బెల్లం, పంచదార వేసుకుని బెల్లం మునిగేలా నీరు పోసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకుని … మెల్లగా గరిటెతో తిప్పుతూ ఉండాలి. బెల్లం పాకం అరిసేలకు సరిపడినట్లు వచ్చిందో లేదో చెక్ చేయడానికి ఒక చిన్న పళ్ళెంలో నీరు తీసుకుని అందులో ఈ బెల్లం పాకం కొంచెం వేసుకుని ఉండ కట్టండి.. అప్పుడు స్మూత్ గా మరీ గట్టిగా కాకుండా ఉండేలా పాకం వచ్చిన తర్వాత.. అందులో కొంచెం నువ్వులు వేసుకోవాలి.. అనంతరం స్టౌవ్ ని స్విమ్ లో పెట్టి.. ఆ పాకంలో తడి బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ.. ఉండలు లేకుండా కలపాలి. అలా కలిపిన తర్వాత ఇప్పుడు అరిసెలు తయారీకి చలిమిడి రెడీ అవుతుంది. స్టౌవ్ మీద బాణలి పెట్టి..నూనే వేసుకుని వేడి చేసుకోవాలి.

దీనిని ఉండలు గా చేసుకుని.. ఒక పాలితిన్ కవర్ పైన అడ్డుకోవాలి. ఇలా అద్దుకున్న అరిసెలను వేడి నూనెలో వేసుకుని మీడియంలో మంటపై వేయించాలి. రెండు వైపులా గోల్డె కలర్ వచేవరకూ వేయించుకోవాలి. తర్వాత రెండు చిల్లల గరిటెతో వాటిని గట్టిగా అద్దుకుని తీసుకుంటే సరి.. అంతే ఆంధ్ర స్పెషల్ రుచికరమైన అరిసెలు రెడీ.

ఆరోగ్య ప్రయోజనాలు: 

పూర్వీకులు కాలానికి అనుగుణంగా వంటలను నిర్ణయించారు. ఆ సంప్రదాయక వంటల్లోనే అనేక పోషకాలున్నాయని వైద్యనిపుణుల చెబుతున్నారు. ఇక అరిసెల్లో ఉన్న పోషకాల వివరానికి వస్తే.. కొత్త బియ్యం పిండి, బెల్లంతో చేసిన అరిసెలు ఆరోగ్యానికి శ్రేష్ఠం. కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వుతో అరిసెలు తయారు చేస్తారు. బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది. కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఐరన్‌తో పాటు పలు పోషకాలు శరీరానికి లభిస్తాయి. బియ్యం పిండి శరీరాన్ని వేడిగా ఉంచుతుంది.

Also Read:

ఎన్నికలకు ముందు మణిపూర్‌లో హింస.. కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు బాంబు పేలుళ్లు!