Muggulu: ఇంటిముందు ముగ్గులు వేయడం వెనుక రీజన్.. ఏ రకం ముగ్గులు ఎందుకు ఏ సందర్భంలో వేస్తారంటే..

Muggulu: సంక్రాంతి (Sankranti)వచ్చిందంటే చాలు నెల రోజుల ముందు నుంచి ముగ్గులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలు సందడి చేస్తాయి. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా నేటి తరం

Muggulu: ఇంటిముందు ముగ్గులు వేయడం వెనుక రీజన్.. ఏ రకం ముగ్గులు ఎందుకు  ఏ సందర్భంలో వేస్తారంటే..
Muggulu
Follow us

|

Updated on: Jan 14, 2022 | 11:00 AM

Muggulu: సంక్రాంతి (Sankranti)వచ్చిందంటే చాలు నెల రోజుల ముందు నుంచి ముగ్గులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలు సందడి చేస్తాయి. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా నేటి తరం మరచిపోతున్న మన సంప్రదాయాల్లో ఒకటిగా మారిపోయింది ముగ్గు. తెలుగువారి లోగిళ్ళలో సంక్రాంతికే కాదు, ఏ శుభాకర్యానికైనా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ముగ్గు. ఇంటి ముంగిట పేడతో కల్లాపి జల్లి.. సున్నంపిండి, బియ్యం పిండి కలిపి.. ముగ్గు(Rangoli) పెట్టడం మన సంప్రదాయం.. అయితే ఇప్పుడు లోగిళ్ళు లేవు.. వాకిళ్ళు తక్కువ. దీంతో ముగ్గు అంటే..అపార్ట్మెంట్ ముందు పెట్టె ఎదో రెండు గీతలు అనే స్టేజ్ కు ప్రస్తుత జనరేషన్ ఉంది. అయితే ఈ ముగ్గులను మగువలే కాదు. కొంతమంది మగవారికి కూడా ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే అలసి సొలసి ఇంటి వాకిలి చేరే మనుషులకు ఇంటి ముందు ముగ్గు సాదర ఆహ్వానం పలుకుతుంది. అంతేకాదు పవిత్ర ధనుర్మాసం(Dhanurmasam) లో వాకిలో మెరుస్తున్న ముగ్గులను చూసినా కొన్ని కొన్ని దోషాలు వాటంతట అవే సమసిపోతాయని మన పూర్వీకుల నమ్మకం.

*ముగ్గు అంటే భూమిని అలంకరించడం .. సుందరంగా అలంకరించిన భూమాతను చూడడం వలన కొన్ని పీడలు నివారింపబడతాయి. ఆయుర్దాయం కూడా పెరుగుతుంది ..మన పూర్వీకులు కళ్ళాపు వాకిళ్ళు.. ముగ్గులు ఎందుకు పెట్టేవారు వాటి వెనుక రీజన్ ఏమిటో చూద్దాం..

*ముగ్గుల్లో గీతాలు ముగ్గులు, చుక్కల ముగ్గులు, లతల ముగ్గులు ఇలా అనేక రకాలున్నాయి. ఇంటి గడప ముందు రెండు అడ్డగీతలు గీసి ముగ్గుని పెడితే.. ఇంటి లోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధి స్తాయని.. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళ కుండా చూస్తాయని నమ్మకం. *ఒక ముగ్గు పెట్టి… దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభ కార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. * నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో ముగ్గు వేస్తే.. భూత, ప్రేత, పిశాచాలు ఇంట్లోకి రాకుండా చూస్తుంది. * ఇంటి ముందు పద్మ ముగ్గు , చుక్కల ముగ్గులలో అనేక రహస్యాలు ఉన్నాయి. అవి కేవలం గీతాలు మాత్రమే కాదు.. యంత్రాలు కూడా. అందుకనే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. * యజ్ఞగుండం, దైవ కార్యంలో నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. *అయితే నెల మీద దేవతలను, స్వస్తిక్, శ్రీ గుర్తులున్న ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. *దేవాలయంలోనూ, అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు రొజూ ముగ్గు పెట్టె స్త్రీకి వైద్యవ్యం రాదని.. సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి *నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి వేసే ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. *పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు.. ఇంటిముండు ముగ్గు లేని ఇంటికి వెళ్లి బిక్ష స్వీకరించేవారు కాదు.

ఇంటి ముందు ముగ్గులేని ఇల్లు.. అశుభానికి గుర్తు. మరణించిన వారి ఇంటిలో, మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గువేయరు.

కనుక మన సాంప్రదాయ మైన ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన సంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం.. భావితరాలకు వారసత్వంగా అందిద్దాం.

ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..