Mokshada Ekadashi: మోక్షద ఏకాదశి రోజున తులసికి సంబంధించిన ఈ పరిహారాలు చేయండి.. ఖజానా డబ్బుతో నిండిపోతుంది
హిందూ మతంలో మోక్షద ఏకాదశిని మోక్షాన్ని ఇచ్చే ఏకాదశిగా భావిస్తారు. మోక్షద ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజిస్తారు. మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతారు. మోక్షద ఏకాదశి రోజున తులసి పూజతో పాటు కొన్ని ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటారు.
ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి ని మోక్షదా ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున ఉపవాసం ఉంటారు. తులసి మొక్కను విష్ణువుతో పాటు పూజిస్తారు. దీనితో పాటు ఏకాదశి వ్రతాన్ని కూడా పాటిస్తారు. తులసి మొక్కను పూజిస్తే విష్ణువు త్వరగా ప్రసన్నుడవుతాడని.. అతని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. హిందూ మత విశ్వాసాల ప్రకారం సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి తులసి మొక్కలో నివసిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే విష్ణు లక్ష్మీ దేవిలు ప్రసన్నం అవుతారు.
మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని మత విశ్వాసం. అలాగే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నివసిస్తుంది. ఏకాదశి తిథి రోజున తులసిని పూజించడమే కాదు తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు కూడా చేస్తారు. ఈ చర్యలను అనుసరించడం వలన డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య తొలగిపోతుంది. అంతేకాదు శ్రీ మహా విష్ణువు అనుగ్రహాన్ని పొందాలనుకుంటే మోక్షద ఏకాదశి రోజున తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలను తప్పకుండా చేయాలి.
మోక్షద ఏకాదశి 2024 శుభ సమయం- ముహూర్తం
వేద పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి డిసెంబర్ 11వ తేదీ మధ్యాహ్నం 3.42 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ ఏకాదశి తిధి డిసెంబర్ 12 మధ్యాహ్నం 1:09 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో మోక్షద ఏకాదశి ఉపవాసం డిసెంబర్ 11 న ఆచరించాల్సి ఉంటుంది.
మోక్షదా ఏకాదశి రోజున తులసి నివారణలు
- శ్రీ మహా విష్ణువును ప్రసన్నం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని పొందాలనుకుంటే మోక్షద ఏకాదశి రోజున తులసి జపమాలతో విష్ణువు నామాలను జపించండి. ఇలా చేయడం వలన జీవితంలోని అన్ని రకాల దుఃఖాలు, అడ్డంకులు తొలగిపోతాయని.. అదృష్టం లభిస్తుందని నమ్మకం.
- ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ.. వాటి నుంచి బయటపడాలని కోరుకుంటే.. మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కకు నీరు సమర్పించండి లేదా తులసికి పచ్చి ఆవు పాలతో అర్ఘ్యం సమర్పించండి. దీని తరువాత తులసి చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయని హిందువుల విశ్వాసం.
- మోక్షద ఏకాదశి రోజున విష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు బియ్యంతో చేసిన పాయసన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇలా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించే సమయంలో దానిలో కొన్ని తులసి దళాలను చేర్చాలి. ఈ పరిహారం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుందని.. కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం.
- ఆర్ధిక ఇబ్బందులు పడుతుంటే.. ధన సమస్యలు దూరం కావాలంటే మోక్షద ఏకాదశి రోజున చెరుకు రసంలో తులసి ఆకులు వేసి విష్ణువుకు అభిషేకం చేయండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోయి సంతోషం కలుగుతుందని, అదృష్టం సొంతం అవుతుందని నమ్మకం.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.