AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh: హిందువులను తుడిచిపెట్టడమే బంగ్లాదేశ్ లక్ష్యమా? బ్రిటన్ ఎంపీ ఆందోళన.. బ్రిటన్ పౌరుల ప్రయాణాలపై హెచ్చరిక

బంగ్లాదేశ్‌లో తాజా పరిస్థితిపై భారత్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. తాజాగా మరో దేశం తమ గళం విప్పింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై ఇటీవలి జరుగుతున్న దాడులు, హింస, విధ్వంసక సంఘటనలను ఉదాహరిస్తూ ఆ దేశంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ప్రీతీ పటేల్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో అదుపు లేకుండా జరుగుతున్న దాడులను చూస్తున్నాం.. మేము బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు.

Bangladesh: హిందువులను తుడిచిపెట్టడమే బంగ్లాదేశ్ లక్ష్యమా? బ్రిటన్ ఎంపీ ఆందోళన.. బ్రిటన్ పౌరుల ప్రయాణాలపై హెచ్చరిక
Uk Parliament Mps Raise Bangladesh Issue
Surya Kala
|

Updated on: Dec 04, 2024 | 10:06 AM

Share

బంగ్లాదేశ్ లోని తాజా పరిస్థితులు, హిందువులపై జరుగుతున్న దాడులపై భారత దేశం మాత్రమే కాదు యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది. తాజాగా బంగ్లాదేశ్ అంశం బ్రిటన్ పార్లమెంటులో కూడా ప్రస్తావనకు వచ్చింది. హిందువులపై దాడులు, హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో బంగ్లాదేశ్‌కు వెళ్లే బ్రిటిష్ పౌరులకు హెచ్చరిక జారీ చేశారు. సోమవారం లేబర్ పార్టీ ఎంపీ బారీ గార్డెనర్ బంగ్లాదేశ్‌లో పరిస్థితిని చర్చించడానికి బ్రిటిష్ పార్లమెంటులో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయమంటూ డిమాండ్ చేశారు. ప్రతిస్పందనగా ఇండో-పసిఫిక్ రీజియన్ విదేశాంగ కార్యాలయ ఇన్‌ఛార్జ్, కేథరీన్ వెస్ట్.. తాను గత నెలలో బంగ్లాదేశ్‌ను సందర్శించానని, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్‌తో కూడా మాట్లాడానని చెప్పారు.

చిన్మోయ్ కృష్ణ దాస్‌ను దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు చేయడంపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం మాకు తెలుసు. బ్రిటిష్ విదేశాంగ, కామన్వెల్త్ కార్యాలయం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. మత స్వేచ్ఛ, ముఖ్యంగా హిందూ సమాజంపై ప్రభావం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో చర్చించనున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ప్రీతీ పటేల్ కూడా బంగ్లాదేశ్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన హిందువులపై అఘాయిత్యాలు, విధ్వంసాలు, ఆలయ ధ్వంసం వంటి సంఘటనలను ఉదహరిస్తూ.. మనం నియంత్రణ లేని హింసలను చూస్తున్నామని చెప్పారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసను అక్కడ ప్రభుత్వం నిర్లక్షం, హింస విస్తరిస్తున్న విధానం.. తాను చాలా భయంతో చూస్తున్నానని చెప్పారు. ఆ దేశంలోని బాధితులకు అండగా ఉంటాం’’ అని అన్నారు.

చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్ట్ పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఎంపీ ప్రీతీ పటేల్.. ఈ విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.

బంగ్లాదేశ్‌లో పరిస్థితిని గమనిస్తూనే ఉంటామని.. రంగమతి, ఖగ్రాచారి, బందర్‌బన్ వంటి ప్రాంతాలలో బ్రిటిష్ పౌరులు ప్రయాణ చేయవద్దని నిషేధం జారీ చేసింది యుకే సర్కార్. ప్రత్యేక అవసరం లేకపోతె ప్రయాణాలు చేయవద్దు అంటూ సూచించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..