Kumbha Mela: కుంభమేళాలో మాత్రమే నాగ సాధువులు ఎందుకు కనిపిస్తారు? దీనికి కారణం తెలుసా..
మహాకుంభమేళా హిందువులకు పవిత్రమైన తీర్థయాత్ర. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒక ప్రత్యేక ప్రదేశంలో నిర్వహించబడుతుంది. ఈ మహా కుంభమేళా జాతరలో లక్షలాది మంది సాధువులు , భక్తులు పవిత్ర నదులలో స్నానాలు చేస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం కుంభమేళా సమయంలో నదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది.
మహా కుంభమేళా హిందువుల దృక్కోణంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇందులో వివిధ అఖారాలకు చెందిన ఋషులు, సాధువులు కనిపిస్తారు. ఈ సాధువులలో కుంభమేళా స్నాన సమయంలో మాత్రమే కనిపించే నాగ సాధువులు కనిపిస్తారు. ఈ నాగ సాధువులు ప్రత్యేకంగా ఉంటారు. నాగ సాధువులు హిందూ మతంలోని సాధువుల కు చెందిన వారు. తపస్సుకు ప్రసిద్ధి చెందారు. వీరు నగ్నంగా జీవిస్తారు. యుద్ధ కళలో ప్రవీణులు. అనేకాదు వీరు వేర్వేరు అఖారాలతో సంబంధం కలిగి ఉంటారు. నాగ సాధువులు భారతదేశ సనాతన సంప్రదాయానికి చెంది సన్యాసులు. వీరు కఠినమైన తపస్సు చేస్తారు. పరిత్యాగం, ఆధ్యాత్మిక సాధనతో జీవిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా నాగ సాధువులకు ప్రత్యేక ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. సాధారణ వ్యక్తులు మాత్రమే కాదు సాధువులు, ఋషులు, నాగ సాధువులు కూడా మహాకుంభ మేళా సమయంలో చేసే స్నానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు.
కుంభమేళాలో మాత్రమే నాగ సాధువులు ఎందుకు కనిపిస్తారు?
నాగ సాధువులు సమాజానికి దూరంగా.. ధ్యానంలో తమ జీవితాన్ని గడుపుతారు. ప్రజలకు దూరంగా ఏకాంతంగా జీవించడానికి ఇష్టపడతారు. కుంభమేళా వంటి ప్రత్యేక సందర్భాలలో మాత్రమే బహిరంగంగా కనిపిస్తారు. నాగ సాధువులు శివ భక్తులు. వీరికి కుంభమేళా చాలా ప్రత్యేకం. కుంభమేళాలో వివిధ అఖారాలకు చెందిన నాగ సాధువులు ఒకరినొకరు కలుసుకుంటారు. తమ ఆలోచనలు ఒకరితో ఒకరు పంచుకుంటారు. వారి సామాజిక బంధాలను బలోపేతం చేసుకుంటారు. కుంభమేళా సమయంలో నాగ సాధువులు తమ సంప్రదాయం, జ్ఞానం, సాధనను ప్రదర్శించే అవకాశం పొందుతారు. కుంభమేళా సమయంలో గంగా, యమునా, సరస్వతి సంగమం వద్ద చేసే రాజ స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ స్నానం ఆత్మను శుద్ధి చేయడానికి, మోక్షాన్ని పొందడానికి ఒక మాధ్యమంగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేక సందర్భంలో నాగ సాధువులు 12 సంవత్సరాల తర్వాత స్నానం చేయడం ద్వారా తన తపస్సు, సాధనను మరింత తీవ్ర తరం చేసుకుంటారు.
నాగ సాధువులు లక్షణాలు
- నాగ సాధువులు సాధారణంగా ధోతీ లేదా లంగోలు ధరించరు. ఎక్కువగా నగ్నంగా ఉంటారు. వీరు ఆకాశాన్ని తన దుస్తులుగా భావిస్తారని నమ్మకం.
- నాగ సాధువులు యుద్ధ కళలో ప్రవీణులు. కత్తి, త్రిశూలం తదితర ఆయుధాలను ఎలా ఉపయోగించాలో వీరికి తెలుసు.
- నాగ సాధువులు చల్లని నీటితో స్నానం చేస్తారు. ఆహారాన్ని భుజించరు. కఠినమైన తపస్సు చేస్తారు.
- నాగ సాధువులు గొప్ప శివ భక్తులు. వీరు జునా అఖారా, నిరంజని అఖారా మొదలైన వివిధ అఖారాలతో సంబంధం కలిగి ఉన్నారు.
నాగ సాధువులు జీవితం విధానం ఏమిటంటే
నాగ సాధువులు జీవితం చాలా సరళమైనది. మితంగా ఆహారాన్ని తింటారు. యోగా , ధ్యానం చేస్తారు. మతపరమైన ఆచారాలలో పాల్గొంటారు. కుంభమేళా తర్వాత నాగ సాధువులు కనిపించరు. ఎందుకంటే నాగ సాధువులు సాధారణంగా అడవులు లేదా పర్వతాల ప్రాంతాల్లో నివసిస్తారు.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.