Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఇకపై భక్తులు కోరినన్ని లడ్డూలు

వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వచ్చిన శ్రీ మహా విష్ణువు ఇలవైకుంఠం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కలు చెల్లించి కోనేతిరాయుడి అనుగ్రహం పొందాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. స్వామివారి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. అంతే ప్రాముఖ్యత శ్రీవారి ప్రసాదం లడ్డుకి ఉంది. ఎవరైనా తిరుపతి వెళ్తున్నారు అంటే లడ్డు తీసుకుని రా అని చెబుతారు. దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి ఎంత ఫేమసో.. శ్రీవారి లడ్డూ కూడా అంతే ఫేమస్. ఈ లడ్డు రుచి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి లడ్డులను ఇక నుంచి భక్తులు కోరినన్ని ఇవ్వడానికి టీటీడీ రెడీ అవుతోంది.

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఇకపై భక్తులు కోరినన్ని లడ్డూలు
Tirukala Laddu
Follow us
Surya Kala

|

Updated on: Dec 04, 2024 | 8:48 AM

తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఎంత ఫేమస్సో.. స్వామివారి ప్రసాదం లడ్డూ కూడా అంతే ఫేమస్. తిరుపతి వెళ్లి వస్తే చాలు లడ్డు ప్రసాదం తెచ్చారా అని అడుగుతాడు. స్వామివారి ఆలయం నుంచి ఇంటికి తీసుకుని వచ్చిన లడ్డూకి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజ చేస్తారు. అనంతరమే తాము ఆరగిస్తారు, స్నేహితులకు బంధువులకు పంచుతారు. అందుకనే తిరుమలకు వెళ్ళినవారు స్వామివారి దర్శనం కోసం ఎంత సేపు ఎదురు చూస్తారో.. అదే విధంగా లడ్డు కొనుగోలు కోసం క్యూలో నిల్చుకుంటారు. తమకు కావాల్సినన్ని లడ్డూలు కొనుగోలు చేయాలనీ భావిస్తారు. అయితే స్వామివారి లడ్డు ప్రసాదానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులకు లడ్డులను అందజేస్తుంది. ఈ విషయంపై భక్తుల్లో అసంతృప్తి ఉంది. అయితే త్వరలో భక్తులు కోరినన్ని లడ్డులు కొనుగోలు చేస్తే వీలుని కల్పించేందుకు టీటీడీ రెడీ అవుతోంది. భక్తులకు అందించేందుకు అదనపు లడ్డు తయారీకి కావాల్సిన పోటు సిబ్బందిని నియమించుకునెందుకు రెడీ అవుతోంది.

రోజుకి శ్రీవారిని సుమారు 65 వేల నుంచి 70వేల వరకూ భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులకు ఆవరణలో ఒక చిన్న లడ్డూని ఉచితంగా ఇస్తారు. అంటే 70 వేల లడ్డులు రోజుకి ఉచితంగా ఇస్తున్నారు. ఇక శ్రీవారి భక్తులు అదనంగా లడ్డు ప్రసాదాన్ని కొనుగోలు చేస్తారు. ఒకొక్కరికి నాలుగు లడ్డులను విక్రయిస్తుంది. ప్రస్తుతం టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6 వేల పెద్ద లడ్డూలను (కల్యాణం లడ్డూ), 3,500 వడలను తయారు చేస్తోంది. ఈ స్వామివారి ప్రసాదాలను స్థానిక తిరుపతి ఆలయాలతో పాటు, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులోని శ్రీవారి ఆలయాల్లో విక్రయిస్తున్నారు.

అయితే సాధారణ రోజులల్లో శ్రీవారి లడ్డు ప్రసాదం అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా.. వారాంతాలు, ప్రత్యెక పర్వదినాలు, బ్రహ్మోత్సవాలు వంటి సమయంలో శ్రీవారి లడ్డుకి భారీ డిమాండ్ ఉంటుంది. ఈ సముయంలో లడ్డులకు కొరత ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ అదనంగా శ్రీవారి ప్రసాదాలను తయారు చేయాలనీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లడ్డు పోటు తయారీ అదనపు సిబ్బంది నియమాలకు చేపట్టింది. 74 మంది శ్రీవైష్ణవులు, 10 మంది శ్రీవైష్ణవేతరులను లడ్డూ తయారీ కోసం నియమించాలని టీటీడీ నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చలికాలంలో మీ కారు బ్యాటరీ కండీషన్‌లో ఉండలా? ఈ ట్రిక్స్‌ పాటించండి
చలికాలంలో మీ కారు బ్యాటరీ కండీషన్‌లో ఉండలా? ఈ ట్రిక్స్‌ పాటించండి
ప్రపంచంలో ‘చికెన్‌ 65’ కి మూడో స్థానం..మొదటి రెండు స్థానాల్లో..
ప్రపంచంలో ‘చికెన్‌ 65’ కి మూడో స్థానం..మొదటి రెండు స్థానాల్లో..
గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా..
గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా..
ఫోన్ చేసిన సైబర్ కేడీలు.. నీళ్లు తాగొస్తానంటూ భార్య ఏం చేసిందంటే
ఫోన్ చేసిన సైబర్ కేడీలు.. నీళ్లు తాగొస్తానంటూ భార్య ఏం చేసిందంటే
సెంటిమెంట్‌ను నమ్ముకున్న సల్మాన్‌ ఖాన్‌
సెంటిమెంట్‌ను నమ్ముకున్న సల్మాన్‌ ఖాన్‌
పెళ్లితో బంధంతో ఒక్కటైన చైతన్య, శోభిత..
పెళ్లితో బంధంతో ఒక్కటైన చైతన్య, శోభిత..
15 ఏళ్ల తర్వాత స్వదేశంలోనే వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లా
15 ఏళ్ల తర్వాత స్వదేశంలోనే వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లా
వార్నీ ఇదేం స్వీట్‌రా బాబు.. మిర్చితో హల్వానా..? వివాహ విందులో
వార్నీ ఇదేం స్వీట్‌రా బాబు.. మిర్చితో హల్వానా..? వివాహ విందులో
ఓలా, ఏథర్‌కు పోటీ.. హీరో నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుద
ఓలా, ఏథర్‌కు పోటీ.. హీరో నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుద
నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు.. చివరకు
నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు.. చివరకు