Wednesday Puja Tips: సిరి సంపదలు, సుఖ సంతోషాల కోసం బుధవారం వినాయకుడి ఇలా పూజించండి..

హిందూమతంలో విఘ్నాలకధిపతి వినాయకుడిని అత్యంత భక్తి శ్రద్దలతో పుజిస్తారు. బుధవారం గణపతికి అంకితం చేయబడిన రోజు. కనుక బుధవారం వినాయకుడిని భక్తీ శ్రద్దలతో పూజిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, విద్యార్ధులు వినాయకుడి అనుగ్రహం కోసం బుధవారం కొన్ని పరిహారాలు చేయండి.

Wednesday Puja Tips: సిరి సంపదలు, సుఖ సంతోషాల కోసం బుధవారం వినాయకుడి ఇలా పూజించండి..
Lord Ganesha Puja
Follow us
Surya Kala

|

Updated on: Dec 04, 2024 | 6:53 AM

హిందువుల ప్రతి ఇంట్లో గణపతి ఉంటాడు. తొలి పూజలను అందుకుంటాడు. భక్తులు వివిధ మార్గాల్లో గణేశుడిని పుజిస్తారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు తీసుకురావడానికి గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వినాయకుని అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని శక్తివంతమైన నివారణ చర్యలు ఉన్నాయి. బుధవారం చేసే పరిహారాలతో గణపతి అనుగ్రహం లభించడమే కాదు ఆ ఇంట్లో సిరిసంపదలు, సుఖ సంతోషాలు నెలకొంటాయి.

కుటుంబ శ్రేయస్సు కోసం

శ్రేయస్సు కోసం గణేశుడిని ప్రసన్నం చేసుకునేందుకు బుధవారం రోజున గణేశుడికి నైవేద్యంగా నెయ్యి , బెల్లం సమర్పించాలి. ఇలా పది బుధవారాలు చేయడం వలన శుభఫలితం లభిస్తుంది. అంతేకాదు బుధవారం రోజున వినాయకుడి సమర్పించిన ఈ నైవేద్యాన్ని ఆవుకి ఆహారంగా అందించాలి. ఈ నెయ్యి, బెల్లం కుటుంబ సభ్యులకు ప్రసాదంగా పంపిణీ చేయకూడదు. ఈ పరిహారం చేయడం వల్ల గణేశుడి అనుగ్రహం లభిస్తుంది.

శాంతి కోసం

తమలపాకును తీసుకుని బుధవారం రోజున వినాయక విగ్రహం ముందు పూజా స్థలంలో ఉంచండి. ప్రతిరోజూ ప్రార్థన సమయంలో పూజించండి. తర్వాత బుధవారం ఈ తమలపాకుని ప్రవహించే నదిలో కలపండి. మరల కొత్త తమలపాకుని తీసుకుని బుధవారం నుంచి రోజూ మళ్ళీ బుధవారం వచ్చే వరకూ గణపతి ముందు పెట్టి పూజించండి.

ఇవి కూడా చదవండి

విద్యా వృద్ధికి

సరస్వతీ దేవి వలె గణేశుడిని విద్య, బుద్ధిలను ప్రసాదించే దైవం అని పిలుస్తారు. మహా భారతం రచించే సమయంలో వేద వ్యాసుడికి గణపతి సహాయం చేశాడని నమ్ముతారు. విద్యార్థులు మంచి చదువు, జ్ఞానం కోసం గణపతిని జమ్మి ఆకుల తో పూజించాలి. అంతేకాదు ఇలా జమ్మి ఆకులను గణపతికి సమర్పించే సమయంలో “ఓం శ్రీ గణేశాయ నమః” అనే ఈ మంత్రాన్ని జపించాలి.

వృత్తిపరమైన ఎదుగుదల కోసం

ఉద్యోగ, వ్యాపార సమస్యలతో బాధపడే వారు ఎంత కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు పొందని వారు, నిరుద్యోగులు బుధవారం గణపతి పూజలో దర్భ గడ్డిని తీసుకుని పసుపులో ముంచి గణేశుడికి సమర్పించి ఓం గం గణపతయే నమః అనే ఈ మంత్రాన్ని జపించాలి.

సంపద, డబ్బు కోసం

ఇంటి ప్రధాన ద్వారం వద్ద కుంకుమతో స్వస్తికను వేయండి. అంతేకాదు గణేశుడికి కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్డూ సమర్పించండి. ఏదైనా దేవాలయంలో రెండు అరటి మొక్కలను నాటండి. శనగపిండి లడ్డూను సమర్పించండి. గణపతికి అరటిపండ్లను సమర్పించే పరిహారం డబ్బు ఇబ్బందులను తీరుస్తుంది. ఆదాయ మార్గాలను పెంచుతుంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.