Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope 2022: ఈ రాశుల వారికి 2022 సంవత్సరంలో వివాహం జరిగే అవకాశం.. అందులో మీ రాశి కూడా ఉందా..

Marriage Horoscope 2022:  మరికొన్ని రోజుల్లో 2021వ సంవత్సరానికి గుడ్ బై చెప్పి.. కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్నాం.. 2021 మంచి , చెడు జ్ఞాపకాలతో గడిచింది. ఈ నేపథ్యంలో..

Horoscope 2022: ఈ రాశుల వారికి 2022 సంవత్సరంలో వివాహం జరిగే అవకాశం.. అందులో మీ రాశి కూడా ఉందా..
Marriage Horoscope 2022
Follow us
Surya Kala

|

Updated on: Dec 15, 2021 | 8:30 AM

Marriage Horoscope 2022:  మరికొన్ని రోజుల్లో 2021వ సంవత్సరానికి గుడ్ బై చెప్పి.. కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్నాం.. 2021 మంచి , చెడు జ్ఞాపకాలతో గడిచింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఇయర్ పై అనేక అంచనాలు పెట్టుకుంటారు. ముఖ్యంగా చాలామంది కొత్త సంవత్సరంలోనైనా తమకు ఉద్యోగం వస్తుందని.. లేదా వివాహం జరుగుతుందని ఇలా అనేక విషయాల గురించి అంచనాలు పెట్టుకుంటారు. అయితే రాబోయే 2022 సంవత్సరంలో ఈ ఐదు రాశుల జీవితాల్లో సంతోషాన్ని నింపుతుందని పురాణం పండితులు చెబుతున్నారు. ఈ రాశుల వారికి మంచి జీవిత భాగస్వామి లభించడమే కాకుండా, వివాహానికి బలమైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. జాతకంలో ఎప్పుడైతే బృహస్పతి అనుగ్రహం లభిస్తుందో అప్పుడే వివాహ యోగం ఏర్పడుతుంది.  కొత్త ఏడాదిలో శని , బృహస్పతి  అనుగ్రహంతో ఏ రాశుల వారికి  ఘనంగా వివాహం జరుగుతుందో తెలుసుకుందాం..

1- కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి జీవిత భాగస్వామి పరంగా కొత్త సంవత్సరం ప్రత్యేకంగా ఉండబోతోంది. శని అనుగ్రహం వలన వివాహ జరుగుతుంది.  ముఖ్యంగా ఏప్రిల్‌లో శని ప్రభావం వలన వివాహ ప్రయత్నాలు అనుకూలమని.. జూలై నెల నుండి వివాహ యోగముందని అంటున్నారు. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్టాన్ని చేకూరుస్తుంది.

2- సింహం సింహ రాశి వారికి కొత్త సంవత్సరంలో వివాహ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక ప్రత్యేక వ్యక్తి సంవత్సరం ప్రారంభంలో సింహరాశి వారికి తారసపడవచ్చు. ఏప్రిల్ నెలలో ఈ రాశి వారికి వివాహం జరిగే అవకాశం ఉంది.  అంతేకాదు ఇప్పటికే పెళ్ళైనవారికి కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉంటుంది.

3- కన్య కన్యా రాశి వారికి కొత్త సంవత్సరంలో కొన్ని గ్రహాల సంచారం అనుకూల ఫలితాలనిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో మూడు నెలల తర్వాత, జీవిత భాగస్వామి కోసం మీ ప్రయత్నం ముగుస్తుంది. మంచి జీవిత భాగస్వామిని కలుస్తారు. త్వరగా పెళ్లి చేసుకుంటారు. 2022లో ఈ రాశి వారికి వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి.

4- వృశ్చికం రాశిఫలం 2022 ప్రకారం, ఈ సంవత్సరం కూడా వృశ్చిక రాశి వారికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. శని , బృహస్పతి దృష్టి ఈ రాశివైపు పడదు. కనుక ఈ రాశివారి  జీవితంలో కొత్త సంబంధం ఏర్పడుతుంది.

5- మీనం ఏప్రిల్ తర్వాత బృహస్పతి మీనరాశిలో సంచరిస్తాడు. ఈ రాశి వారికి చాలా మంచి వివాహబంధం ఏర్పడనుంది. జీవిత భాగస్వామి కోసం చాలా కాలంగా వెతుకుతున్న వారికి ఈ సంవత్సరం భాగస్వామి లభిస్తుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికం తర్వాత త్వరలో పెళ్లి పీటలు ఎక్కవచ్చు.

గమనిక– ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, గ్రహాలు, జాతకం వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Also Read:   విలన్‌గా నటించాలనే కోరిక ఇన్నాళ్లకు తీరింది.. ఏ టైప్ పాత్రలు ఏ భాషలో వచ్చినా చేస్తా: సునీల్