AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha kumbha Mela: మహాకుంభమేళాకు ముమ్మరంగా సన్నాహాలు.. హెలికాప్టర్ నుంచి భక్తులు, సాధువులపై పూలవర్షం..!

ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా నిర్వహణకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొత్త ఏడాదిలో యోగి ప్రభుత్వం మహాకుంభ మేళాను గ్రాండ్‌గా, చిరస్మరణీయంగా మార్చడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆకాశం నుంచి పూల వర్షం కురిపించే యోచన కూడా ఉంది. ఇది భక్తులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. మహాకుంభ మేళా దివ్యత్వాన్ని మరింత పెంచుతుంది.

Maha kumbha Mela: మహాకుంభమేళాకు ముమ్మరంగా సన్నాహాలు.. హెలికాప్టర్ నుంచి భక్తులు, సాధువులపై పూలవర్షం..!
Maha Kumbha Mela
Surya Kala
|

Updated on: Dec 07, 2024 | 1:09 PM

Share

గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 2025లో మహా కుంభ మేళాను నిర్వహించనున్నారు. ఈ కుంభ మేళా ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవంగా పరిగణించబడుతుంది. 2025లో జరగనున్న కుంభ మేళా జాతరను అపూర్వంగా, చిరస్మరణీయంగా మార్చడానికి యోగి ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. ఇప్పటికే మహా కుంభ మేళా కోసం వచ్చే భక్తుల భద్రత, పరిశుభ్రత, అవసరమైన అన్ని సౌకర్యాల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. తద్వారా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికీ అద్భుతమైన, సురక్షితమైన అనుభవంగా నిలవనుంది. ఇప్పటికే ప్రభుత్వం మహా కుంభ మేళాను రాష్ట్రంలోని 76వ జిల్లాగా ప్రకటించింది. కొత్త జిల్లాకు “మహా కుంభమేళా జిల్లా” అని పేరు పెట్టింది.

మహా కుంభ మేళా వైభవాన్ని , దివ్యత్వాన్ని మరింత పెంచేందుకు భక్తులపై ఆకాశం నుంచి పూల వర్షం కురిపించే విధంగా ప్రణాళికాబద్ధంగా పనులు జరుగుతున్నాయి. కుంభ, మాఘ మేళా వంటి అతి పెద్ద మతపరమైన కార్యక్రమాలలో యోగి ప్రభుత్వం ఇప్పటికే భక్తులపై చాలాసార్లు పూల వర్షం కురిపించింది. అదే సంప్రదాయాన్ని 2025లో జరగనున్న మహా కుంభ మేళాకి కూడా కొనసాగించాలని యుపీ సర్కార్ యోచిస్తోంది.

అన్ని ఘాట్‌లపై పూలవర్షం కురిసేలా ప్లాన్

ప్రయాగ్‌రాజ్ డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ ఈ విషయంపై మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు ఇప్పటికే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో హెలికాప్టర్‌ల నుంచి భక్తులు, సాధువులు, కన్వాడీలపై పూల వర్షం కుకురిపిమ్చినట్లు గుర్తు చేసుకున్నారు. ఇదే సంప్రదాయం 2025 మహా కుంభ మేళా సమయంలో కూడా కొనసాగుతుంది. ఈసారి మహా కుంభ మేళాకి వచ్చే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంగంతో పాటు ఇతర ప్రధాన ఘాట్‌లలో పూల వర్షం కురిసేలా ప్లాన్ చేస్తున్నారు. అన్ని ఘాట్‌ల వద్ద భక్తులకు ఈ అనుభూతి చిరస్మరణీయంగా ఉండేలా త్వరలో దీనిపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

సనాతన సంస్కృతి, విశ్వాసం పట్ల గౌరవం

యోగి ప్రభుత్వ హయాంలో ఉత్తరప్రదేశ్‌లో భక్తులపై పూల వర్షం కురిపించడం ఇప్పుడు సనాతన సంస్కృతి, విశ్వాసానికి నివాళులర్పించే చిహ్నంగా మారింది. మహా కుంభ మేళా , మాఘమేళా లేదా కన్వర్ యాత్ర ఇలా ప్రతి సందర్భంలోనూ పువ్వల వర్షం కురిపించి భక్తులను గౌరవిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ స్వయంగా హెలికాప్టర్ల నుంచి వేదికలపై నుంచి భక్తులపై పూల వర్షం కురిపిస్తూ సనాతన సంస్కృతి వైభవాన్ని అనేక సార్లు చాటి చెప్పారు. 2021లో జరిగిన కుంభమేళాలో మౌని అమావాస్య రోజున సంగం ఒడ్డున కోట్లాది మంది భక్తులపై పూల వర్షం కురిపించారు. అప్పుడు #UPMePhoolVarsha హ్యాష్‌ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయ్యింది. కొత్త సంవత్సరం 2025లో జరగనున్న మహాకుంభమేళలో కూడా ఈ సంప్రదాయం మరింత భారీ స్థాయిలో నిర్వహించబడే అవకాశం ఉంది.. తద్వారా ఈ కార్యక్రమం మరింత గొప్పగా, చిరస్మరణీయంగా మారుతుందని భావిస్తున్నారు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..