AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Transit 2024: ఈ నెల 15న రాశిని మార్చుకోనున్న సూర్యుడు.. ఈ ఐదు వారికి నెల రోజులు అన్నీ కష్టాలే.. జాగ్రత్త సుమా..

ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు డిసెంబర్ 15న ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడు రాశిని మార్చుకోవడం వలన కొన్ని రాశుల వారికి ప్రయోజనం కలుగుతుంది. అదే సమయంలో కొన్ని రాశుల వారు జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

Surya Transit 2024: ఈ నెల 15న రాశిని మార్చుకోనున్న సూర్యుడు.. ఈ ఐదు వారికి నెల రోజులు అన్నీ కష్టాలే.. జాగ్రత్త సుమా..
Surya Transit In Sagittariu
Surya Kala
|

Updated on: Dec 07, 2024 | 9:46 AM

Share

సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాడు. సూర్యుడు ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ నెలలో డిసెంబర్ 15 న సూర్యుడు తన రాశిని మార్చుకోనున్నాడు. డిసెంబరు 15న సూర్యభగవానుడు వృశ్చికరాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్య భగవానుడు నవ గ్రహాలకు అధిపతి. జ్యోతిష్యంలో సూర్య భగవానుడికి ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. సూర్యభగవానుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు సూర్యుడి రాశి మార్పు వలన ఏ రాశికి చెందిన వారికి సమస్య కలుగుతుందో ఈ రోజు తెలుసుకుందాం..

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు సూర్యుడు గ్రహ సంచారం వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనుస్సు రాశిలోకి అడుగు పెట్టిన తరవాత ఈ రాశికి చెందిన వ్యక్తులకు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు నెలకొని.. విడిపోయే అవకాశం ఉంది. కనుక వీరు ఈ నెల రోజులు మాటను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. అలోచించి ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఆలోచించి పెట్టుబడులు పెడితే లాభాలను అందుకుంటారు. సమాజంలో గౌరవానికి భంగం కలుగుతుంది.

కర్కాటక రాశి: సూర్యుడి రాశిలో మార్పు వలన ఈ రాశికి చెందిన వారికి అనేక బాధలు పడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు వచ్చే అవకాశం ఉంది. పెద్దల సలహాతో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది.మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు.

ఇవి కూడా చదవండి

కన్య రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉదార సంబధిత ఇబ్బందులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వ్యాపారస్తులు వ్యాపరంలో నష్టాలను ఎదుర్కొంటారు. మనసికంగా ఒత్తిడి పడతారు. చేపట్టిన పనిలో విజయం సాధించాలంటే తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం కొంత మానసిక శాంతిని ఇస్తుంది.

మకరరాశి: సూర్యుడు ధనుస్సు రాశిలోకి అడుగు పెట్టిన తరవాత మకర రాశి వారు వ్యాపారస్తులు ఊహించని విధంగా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మేలు. లేదంటే గృహ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కుంభ రాశి: సూర్యుడు రాశిని మార్చుకోవడం వలన డిసెంబర్ 15 నుంచి ఈ రాశివారు తగిన జాగ్రత్తగా అడుగు వేయాలి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండలి. ఉద్యోగస్తులు అధికారులతో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. గౌరవం తగ్గుతుంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.