Saturday Puja Tips: జాతకంలో శని దోష నివారణకు శనివారం హనుమంతుడిని ఎలా పూజించాలంటే
హిందువులు అనేక మంది దేవతలను ,దేవుళ్ళను పుజిస్తారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళడమే కాదు.. ఆ సేతు హిమాచలం అడుగడుగున గుడి ఉంటుంది. రామాలయం లేని వీధి.. హనుమంతుడి లేని రామాలయం ఉండదు. అదే విధంగా రామ భక్త హనుమాన్ కి కూడా ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి.
ఎక్కడ రామ నామ స్మరణ జరుగుతుంటే అక్కడ హనుమంతుడు ఉంటాడని నమ్మకం. అంతేకాదు చిరంజీవి అయిన హనుమంతుడు పిలిస్తే పలికే కలియుగ దైవంగా భక్తులతో పూజలను అందుకున్నాడు. మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడిన రోజు. అయితే శనివారం కూడా హనుమంతుడిని పూజించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయని .. ముఖ్యంగా శని దోషంతో ఇబ్బంది పడేవారికి విశేష ఫలితం ఉంటుందని నమ్మకం. కనుక ఈ రోజు శనివారం శనిశ్వరుడి అనుగ్రహం కోసం శని దోష నివారణకు చేయాల్సిన విశేష పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం..
- తనను ఓడించిన హనుమంతుడు శనీశ్వరుడు యిచ్చిన వరం.. శనివారం హనుమంతుడి పూజ చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని. కనుక శనివారం రోజున హనుమంతుడిని పూజిస్తారు.
- శని దోష నివారణకు ఆంజనేయస్వామి ఆలయానికి ఆలయంలో 41 లేదా 108 పూజలు చేయడం విశేష ఫలితాలు లభిస్తాయి.
- ఆంజనేయస్వామికి ఆయనకు ఇష్టమైన సిందూరానని సమర్పించి,, అభిషేకం చేయడం, తమలపాకులు సమర్పించడం శుభ ఫలితాలను ఇస్తాయి.
- హనుమంతుడికి ఇష్టమైన అరటి పండ్లు, అప్పాలు, వడలు నైవేద్యంగా సమర్పించడం శుభం కలుగుతుందని నమ్మకం.
- ఆలయంలో సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా పఠనం చేసిన భక్తులను హనుమంతుడు అనుగ్రహిస్తాడు.
- హనుమంతుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిస్తే ఆలయంలో సేవ చేయడం వలన ఆయురారోగ్యాలు, సిరిసంపదలు సొంతం అవుతాయని నమ్మకం.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.