AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరివర్తన యోగం.. కొత్త ఏడాదిలో నిత్య కల్యాణం, పచ్చ తోరణంలా వారి జీవితం..!

Parivartan Yoga: వచ్చే ఏడాది(2025) జనవరి 28 నుంచి సుమారు 75 రోజుల పాటు శుక్ర, గురువుల మధ్య రాశి పరివర్తన కొనసాగుతుంది. గురు గ్రహానికి చెందిన మీన రాశిలో శుక్రుడు, శుక్ర గ్రహానికి చెందిన వృషభ రాశిలో గురువు సంచారం వల్ల ఈ విశిష్టమైన పరివర్తన యోగం ఏర్పడుతోంది. ఇందులో శుక్రు డికి మీన రాశి ఉచ్ఛ రాశి కూడా కావడంతో కొన్ని రాశుల వారికి ఈ పరివర్తన వల్ల జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంలా సాగిపోతుంది.

పరివర్తన యోగం.. కొత్త ఏడాదిలో నిత్య కల్యాణం, పచ్చ తోరణంలా వారి జీవితం..!
Parivartan Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 06, 2024 | 7:18 PM

Share

Astrology 2025: వచ్చే ఏడాది జనవరి 28 నుంచి సుమారు 75 రోజుల పాటు శుక్ర, గురువుల మధ్య రాశి పరివర్తన జరుగుతోంది. గురు గ్రహానికి చెందిన మీన రాశిలో శుక్రుడు, శుక్ర గ్రహానికి చెందిన వృషభ రాశిలో గురువు సంచారం వల్ల ఈ విశిష్టమైన పరివర్తన యోగం ఏర్పడుతోంది. ఇందులో శుక్రు డికి మీన రాశి ఉచ్ఛ రాశి కూడా కావడంతో కొన్ని రాశుల వారికి ఈ పరివర్తన వల్ల జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంలా సాగిపోతుంది. రెండు శుభ గ్రహాల మధ్య పరివర్తన జరగడం వల్ల ప్రస్తుతం వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశులకు కొత్త సంవత్సరం శుభ సూచకంగా ప్రారంభం కాబోతోంది.

  1. వృషభం: రాశ్యధిపతి శుక్రుడికి, లాభాధిపతి గురువుకు మధ్య పరివర్తన వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి నిశ్చయం అవుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరు తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి భాగ్య, లాభాధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి, ఆదాయం దిన దినాభివృద్ధికి బాగా అవకాశం ఉంది. విదేశీ ఆదాయాన్ని అనుభవించే యోగం కూడా పడుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. సమాజంలోని ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ తాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అపార లాభాలు కలుగుతాయి.
  3. కన్య: ఈ రాశికి సప్తమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల మహా భాగ్య యోగాలు కలుగు తాయి. సిరిసంపదలు బాగా వృద్ధి చెందుతాయి. సంపన్న వర్గానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడ డం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో రాజయోగాలు కలుగుతాయి. ఉన్నత పదవులు లభించడం గానీ, సంస్థలకు అధిపతులు కావడం గానీ జరుగుతుంది. రాజకీయ ప్రము ఖులతో పరిచయాలు పెరుగుతాయి. తల్లితండ్రుల నుంచి విలువైన ఆస్తిపాస్తులు సంక్రమిస్తాయి.
  4. వృశ్చికం: ఈ రాశికి పంచమ, సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల జీవన శైలి పూర్తిగా మారి పోతుంది. అనేక విధాలుగా సంపద కలిసి వస్తుంది. అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపార ధన లాభాలు కలుగుతాయి. సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
  5. మకరం: ఈ రాశికి తృతీయ, పంచమ స్థానాల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బ డిగా వృద్ది చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాల్లో అనూహ్యమైన ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీత భత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా బాగా కలిసి వస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.
  6. కుంభం: ఈ రాశికి ధన, చతుర్థ స్థానాల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఇంట్లో ముఖ్యమైన పెండింగ్ శుభ కార్యాలన్నీ జరుగుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆస్తిపాస్తులు సమ కూరుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో సుఖ సంతో షాలు వృద్ధి చెందుతాయి. కీర్తి ప్రతిష్ఠలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభి స్తుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది.

బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ