Kuja Vakri: వక్ర కుజుడితో వారికి ఉత్తమ యోగాలు.. ఆ రాశులకు ఆకస్మిక శుభాలు..!

Auspicious Horoscope: శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి వచ్చే ఏడాది జనవరి 20 వరకు కుజుడు కర్కాటకంలో వక్రించడం జరుగుతోంది. కర్కాటక రాశి కుజుడికి నీచ రాశి. నీచ రాశిలో వక్రించిన గ్రహానికి ఉచ్ఛ బలం పడుతుంది. దీంతో కుజుడికి ఉచ్ఛ బలం లభించినందువల్ల కొన్ని రాశులకు అనేక అంశాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. అవి ఏయే రాశులో ఇక్కడ చూద్దాం..

Kuja Vakri: వక్ర కుజుడితో వారికి ఉత్తమ యోగాలు.. ఆ రాశులకు ఆకస్మిక శుభాలు..!
Kuja Vakri
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 06, 2024 | 6:58 PM

Mars Retrograde Impact: డిసెంబర్ 6 నుంచి వచ్చే ఏడాది జనవరి 20 వరకు కుజుడు కర్కాటకంలో వక్రించడం (Kuja Vakri) జరుగుతోంది. కర్కాటక రాశి కుజుడికి నీచ రాశి. నీచ రాశిలో వక్రించిన గ్రహానికి ఉచ్ఛ బలం పడుతుంది. ప్రస్తుతం కుజుడికి ఉచ్ఛ బలం లభించినందువల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశులకు అనేక అంశాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. అధికారం, సాహసం, చొరవ, భూలాభం, ఆదాయం వంటి వాటికి కారకుడైన కుజుడు వక్రించి ఉచ్ఛ బలం పొందినందువల్ల ఈ విషయాల్లో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది.

  1. మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో వక్రించినందువల్ల ఆస్తి వివాదాలు అను కూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి లభించే అవకాశం ఉంది. భూలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కొద్ది ప్రయత్నంతో గృహ, వాహన సౌకర్యాలు కలగడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా లభించే అవకాశం ఉంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ కావడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు ఇదే రాశిలో వక్రించడం వల్ల అకస్మాత్తుగా, అనుకోకుండా జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా అందలాలు ఎక్కు తారు. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. చదువుల్లో విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. సామాజికంగా కూడా ప్రాభవం, ప్రాధా న్యం పెరుగుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వివాదాలన్నీ పరిష్కారం అయ్యే అవకాశంఉంది.
  3. కన్య: ఈ రాశికి లాభ స్థానంలో కుజుడు వక్రించినందువల్ల ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. రావల సిన డబ్బు, బాకీలు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగు తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయపరంగా ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరు తుంది. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉన్నత వర్గాలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
  4. తుల: ఈ రాశికి దశమ స్థానంలో కుజుడు వక్రించి ఉచ్ఛ బలం పట్టడం వల్ల ఉద్యోగపరంగా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు అనేక అవకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా పురోగమి స్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపార ధనలాభం కలుగుతుంది. మాటకు విలువ పెరుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. వృశ్చికం: రాశ్యధిపతి కుజుడికి నీచ స్థితి తొలగిపోయినందువల్ల ఈ రాశివారు తప్పకుండా ఉద్యోగంలో అంద లాలు ఎక్కడం జరుగుతుంది. జీవన శైలి మారిపోతుంది. ఉన్నత వర్గాలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆర్థిక పరిస్థితి ఇదివర కటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.
  7. మకరం: ఈ రాశకి సప్తమ స్థానంలో కుజుడు ఉచ్ఛ బలం పొందినందువల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. భూలాభం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగులకు అనేక అవకాశాలు కలిసి వస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సంతాన ప్రాప్తి సూచనలున్నాయి.