Astrology 2025: అనుకూలంగా మూడు కీలక గ్రహాలు.. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి సక్సెస్!
Job and Marriage Astrology 2025: ప్రస్తుతం గురు, శుక్ర, కుజ గ్రహాల మధ్య పరస్పర దృష్టి ఏర్పడింది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశముంది. ఈ మూడు గ్రహాలు మరో నాలుగు నెలల పాటు.. అంటే 2025 మార్చి వరకు అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు రావడానికి, పెళ్లిళ్లు కావడానికి, ఇతరత్రా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది.
Telugu Astrology: ప్రస్తుతం గురు, శుక్ర, కుజ గ్రహాల మధ్య పరస్పర దృష్టి ఏర్పడినందువల్ల ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంది. ఈ మూడు గ్రహాలు మరో నాలుగు నెలల పాటు.. అంటే 2025 మార్చి వరకు అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు రావడానికి, పెళ్లిళ్లు కావడానికి, ఇతరత్రా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశులకు ఉద్యోగ, వివాహ యోగాలు తప్ప కుండా పట్టే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశివారికి ఏ విషయంలోనైనా తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభాలు కలుగుతాయి. వీరికి ఫిబ్రవరి లోపు సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వివా హాలు జరిగే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు స్వదేశీ కంపెనీల నుంచే కాక, విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి.
- వృషభం: రాశినాథుడు, వివాహ కారకుడు అయిన శుక్రుడు భాగ్య స్థానంలో ఉండడం, దాన్ని గురు, కుజ గ్రహాలు చూడడం వల్ల ఈ రాశివారికి అతి త్వరలో తప్పకుండా వివాహం అయ్యే అవకాశం ఉంది. కోరుకున్న వ్యక్తితో వివాహం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. విదేశీ సంబంధం ఖాయం కావచ్చు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. కొత్త ఉద్యోగులకు స్థిరత్వం కలుగుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. వాహన యోగం కలుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశిలో కుజుడు, సప్తమంలో శుక్రుడు, లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అయి, వచ్చే ఏడాది ప్రారంభంలోనే జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. కొద్ది ప్రయత్నంతో బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అయి పెళ్లికి దారితీసే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది.
- కన్య: ఈ రాశికి పంచమంలో శుక్రుడు, లాభస్థానంలో కుజుడు, భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో కలలో కూడా ఊహించని పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి జీతభత్యాలు, హోదాతో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులకు అనేక అవకాశాలు అంది వస్తాయి. విదేశీ కంపెనీల్లోకి మారే సూచనలున్నాయి. గృహ యోగం పడుతుంది.
- మకరం: వచ్చే నాలుగైదు నెలల్లో ఎక్కువగా లాభపడేది ఈ రాశివారే. ఆశించిన వ్యక్తితో వివాహం నిశ్చ యం అవుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. ఉద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మరింత మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు స్వదేశీ అవకాశాలతో పాటు విదేశీ అవ కాశాలు, ఆఫర్లు కూడా లభిస్తాయి. గృహ, వాహన యోగాలు పట్టడానికి కూడా అవకాశం ఉంది.
- మీనం: లాభ స్థానంలో ఉన్న శుక్రుడిని రాశ్యధిపతి గురువు వీక్షిస్తున్నందువల్ల ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. సాధారణంగా ఫిబ్రవరి లోపు ఈ రాశివారికి వివాహం జరిగి పోయే అవకాశం ఉంది. ప్రేమ వివాహ సూచనలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులకు అనేక అవ కాశాలు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందనలకే ఎక్కువ అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశీ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంది.