Astrology 2025: కీలక గ్రహాల అనుకూలత.. వచ్చే ఏడాది కుబేరులయ్యేది ఈ రాశుల వారే..!

Money Astrology 2025: ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శని గ్రహం.. వచ్చే ఏడాది మార్చి 29న మీన రాశిలోకి మారనుంది. అలాగే ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న రాహువు మే 18న కుంభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ రెండు ప్రధాన గ్రహాలు పరివర్తన చెందడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రాశుల వారు కుబేరులయ్యే అవకాశముంది.

Astrology 2025: కీలక గ్రహాల అనుకూలత.. వచ్చే ఏడాది కుబేరులయ్యేది ఈ రాశుల వారే..!
Astrology 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 04, 2024 | 3:37 PM

ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనీశ్వరుడు వచ్చే ఏడాది మార్చి 29న మీన రాశిలోకి మారడం జరుగుతుంది. ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న రాహువు మే 18న కుంభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ రెండు ప్రధాన గ్రహాలు పరివర్తన చెందడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకర రాశులను దాదాపు కుబేరులను చేసే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశికి శని, రాహువుల మధ్య పరివర్తన జరగడం విపరీత రాజయోగానికి దోహదం చేస్తుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెంది కోటీశ్వరులు కావడానికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచే కాక, కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి కూడా బయటపడడం జరుగుతుంది. ఆదాయ పరంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు అపారమైన లాభాలను తెచ్చి పెడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి.
  2. మిథునం: శని, రాహువులు రాశులు మారడం వల్ల విదేశీ ప్రయత్నాలన్నీ సానుకూలపడతాయి. విదేశీ సొమ్ము అనుభవించే అదృష్టం కలుగుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా ఇతర దేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం రాజసంగా సాగిపోతుంది. ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది.
  3. కర్కాటకం: ఈ రాశికి ఈ రెండు గ్రహాల రాశి మార్పు విపరీత రాజయోగాన్నిఇస్తుంది. ఆదాయావకాశాలు బాగా వృద్ధి చెంది అపర కుబేరులయ్యే అవకాశం కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి కలిగి, జీత భత్యాలు, అదనపు ఆదాయం వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర లావాదేవీలు అంచ నాలను మించి లాభాలనిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరు ద్యోగులకు భారీ జీతాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది.
  4. తుల: ఈ రాశికి రాశి మార్పుతో ఈ రెండు ప్రధాన గ్రహాలు అనేక ధన యోగాలను ఇవ్వడం జరుగు తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. తల్లితండ్రుల కారణంగాసంపద పెరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది. రావలసిన డబ్బంతా వసూలవుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు అత్యధిక లాభాలనిస్తాయి. లాటరీ వంటివి కలసి వచ్చే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలిగే అవకాశం ఉంది.
  5. మకరం: ఈ రాశికి ఏలిన్నాటి శని తొలగిపోవడంతో పాటు, రాహువు ధన స్థానంలోకి ప్రవేశించడంవల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తొలగిపోయి మనశ్శాంతి ఏర్పడుతుంది. అదనపు ఆదాయ ప్రయ త్నాలు వంద శాతం సఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.

డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి