Shukra Gochar: మకర రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి భోగభాగ్యాలు, సిరిసంపదలు

Shukra Gochar 2024: డిసెంబర్ 2 అర్థరాత్రి నుంచి శుక్రుడు మకర రాశిలో ప్రవేశించాడు. దీని వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. డిసెంబర్ 28 వరకూ శుక్రుడు ఇదే రాశిలో కొనసాగడం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి భోగభాగ్యాలు, సిరిసంపదలు దక్కనున్నాయి. అందులో ఏయే రాశులున్నాయో చూడండి.

Shukra Gochar: మకర రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి భోగభాగ్యాలు, సిరిసంపదలు
Shukra Gochar 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 03, 2024 | 7:12 PM

డిసెంబర్ 2 అర్థరాత్రి నుంచి మకర రాశిలో ప్రవేశించిన శుక్రుడి వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ నెల 28 వరకూ శుక్రుడు ఇదే రాశిలో కొనసాగడం జరుగుతుంది. అయితే, ఈ రాశుల వారు శుక్రుడి లక్షణాలకు, వ్యవహార శైలికి అనుగుణంగా నడుచుకోవడం అవసరం. శుక్రుడిని ఎంత మెప్పిస్తే అతను అంతగా అనుగ్రహిస్తాడని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. లక్ష్యం దిశగా కొద్దిగా అడుగులు వేయడం అవసరం. ప్రస్తుతం ఈ శుక్ర సంచారం వల్ల బాగా లబ్ది పొందబోతున్న రాశులు మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశులు.

  1. మేషం: ఈ రాశివారు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడం మంచిది. స్వదేశాల్లో కంటే విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించడం వల్ల ఉపయోగం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలకు సమయం అను కూలంగా ఉంది. అలంకార వస్తువులు, దుస్తులు, ఆభరణాలు, మద్యం వంటి వ్యాపారాలను ప్రారం భించినా, వాటిల్లో పెట్టుబడులు పెట్టినా అత్యధికంగా లాభాలు పొందుతారు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు, ఆదాయ మార్గాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.
  2. వృషభం: ఈ రాశివారు స్వదేశంలో కన్నా విదేశాల్లో రాణించే అవకాశం ఉంది. అందువల్ల వృత్తి, ఉద్యోగాల విషయంలో విదేశీ ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. తల్లితండ్రుల నుంచి ఆస్తి పాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. సమాజంలో ప్రముఖులతో లాభదాయక సంబంధాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుం బంలో సుఖ సంతోషాలు పెరగడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో సంపద బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి మీద దృష్టి పెట్టడంతో పాటు వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. గృహ, వాహన సౌకర్యాలు కలు గుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా హోదా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి ఖాయమవుతుంది.
  4. కన్య: ఈ రాశికి ధన, భాగ్యాధిపతి అయిన శుక్రుడు అనుకూలంగా మారడం వల్ల ఏ ప్రయత్నం తల పెట్టినా తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలన్నీ తప్పకుండా అంచనాలను మించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆదాయపరంగా కొత్త పుంతలు తొక్కు తాయి. ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది.
  5. తుల: రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచారం ప్రారంభించినందువల్ల ఆస్తిపాస్తులు, ఆదాయం పెంచుకోవడం మీద దృష్టి పెట్టడం మంచిది. కొద్ది ప్రయత్నంతో అవన్నీ తప్పకుండా నెరవేరు తాయి. గృహ, వాహన ప్రయత్నాలను ముమ్మరం చేయవలసిన అవసరం ఉంది. ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. తల్లితండ్రుల నుంచి ఆస్తి లేదా సంపద లభిస్తుంది. లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి.
  6. మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ఈ రాశిలో సంచారం ప్రారంభించినందువల్ల జీవనశైలిలో మార్పు వస్తుంది. అనేక విధాలుగా హోదా, స్థాయి పెరుగుతాయి. ఉద్యోగంలో అధికార లాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. సమాజంలో ప్రముఖుడుగా గుర్తింపు పొందడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా తొలగిపో తాయి. ఆరోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.

ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్