Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు కొత్త అవకాశాలు.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Today Horoscope (December 4, 2024): మేష రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వృషభ రాశి వారికి కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశముంది. మిథున రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు కొత్త అవకాశాలు.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 04th December 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 04, 2024 | 5:01 AM

దిన ఫలాలు (డిసెంబర్ 4, 2024): మేష రాశి వారు వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృషభ రాశి వారికి కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ది చెందుతుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అదనపు ఆదాయానికి లోటుండదు. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి లావాదేవీలకు దూరంగా ఉండాలి. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగులు పదోన్నతి, జీతాల పెరుగుదల విషయంలో శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి కొద్దిగా బయటపడ తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. రావలసిన డబ్బును, బాకీలను వసూలు చేసుకుంటారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలతో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. ఒత్తిళ్లు, సమస్యల నుంచి బయటపడ తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో లక్ష్యాలను పూర్తి చేయడానికి కొద్దిగా శ్రమపడాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభా లను పెంచడం మీద శ్రద్ధ పెడతారు. అదనపు ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. బంధు మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలకు కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొద్దిగా పురోగతి సాధిస్తాయి. ఉద్యోగులకు కొద్దిగా పని ఒత్తిడి తగ్గుతుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ద పెరు గుతుంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందర పాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. పిల్లల విద్య, ఉద్యోగాల పరిస్థితి సంతృప్తికరంగా సాగి పోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం నిలకడగా సాగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, అధికారుల ఆదరణ పెరు గుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ఒకటిరెండు శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరిగి అతిగా ఆధారపడతారు. వృత్తి జీవితంలో కొత్త లక్ష్యాలను పూర్తి చేయవలసి ఉంటుంది. వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. స్వల్ప అనా రోగ్యానికి అవకాశం ఉంది. ఆదాయం అనేక విధాలుగా వృద్ది చెందుతుంది. కొద్ది వ్యయ ప్రయా సలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు విస్తరిస్తాయి. లాభాలకు లోటుండకపోవచ్చు. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. వృత్తి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ అనుకూలంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త లక్ష్యాలను అప్పగించడం జరుగుతుంది. ఆర్థికంగా చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి కొంత వరకూ విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన పనులు, వ్యవ హారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవు తుంది. శక్తికి మించి ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ముఖ్యమైన ప్రయత్నాలు సునాయాసంగా నెరవేరుతాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవ కాశం ఉంది. అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఒకటి రెండు మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు, వ్యవహారాలు సకాలంలో అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా సాగుతుంది. ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. బంధుమిత్రులతో అపార్థాలను తొలగించుకుంటారు. వ్యాపారులకు అవ కాశాలు బాగా పెరుగుతాయి నిరుద్యోగులు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసు కుంటారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదరవచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగుల ప్రతిభకు, సమర్థతకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశిం చిన లాభాలను పొందుతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.