- Telugu News Photo Gallery Spiritual photos Lord Shani transit 2025 these zodiac signs to get luck and best time details in telugu
Astrology 2025: శని దోషాల నుంచి విముక్తి.. కొత్త ఏడాదిలో వారికి శుభ ఫలితాలు పక్కా..
Lord Shani Dev - Astrology 2025: ప్రస్తుతం అనేక రకాలుగా శని దోషాన్ని అనుభవిస్తున్న రాశుల వారికి మార్చి 29తో ఈ దోషాలన్నీ తొలగిపోయి ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కుంభ రాశిలో సంచారం చేస్తున్న శని మార్చి 29 న మీన రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. నిజానికే ఒక నెల రోజుల ముందు నుంచి శని దోషం తగ్గడం ప్రారంభిస్తుంది. ప్రస్తుతం శని దోషం అనుభవిస్తున్నవారికి 2027 జూన్ 3వ తేదీ వరకూ ఎటువంటి శని సమస్యలూ ఉండకపోవచ్చు. శని మీన రాశి ప్రవేశం వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులకు అనేక శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది.
Updated on: Dec 06, 2024 | 6:38 PM

వృషభం: ఈ రాశికి లాభ స్థానంలోకి ప్రవేశిస్తున్న శనీశ్వరుడి వల్ల అనేక విధాలైన లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచే కాక, ఆరోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఏ రంగంలో ఉన్న వారికైనా తప్పకుండా పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించడం, ఉన్నత స్థానాలకు వెళ్లడం వంటివి జరుగుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం: ఈ రాశికి పదవ స్థానంలోకి శని ప్రవేశిస్తున్నందువల్ల ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాలోనూ ఊహించని పురోగతి ఉంటుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఉద్యో గులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో అదనపు భారం మీద పడినప్పటికీ ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు బాగా వృద్ది చెందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు.

కర్కాటకం: ఈ రాశివారికి అష్టమ శని దోషం తొలగిపోతుండడం వల్ల జీవితానికి సంబంధించిన కీలక అంశాల్లో పురోగతి చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో హోదాతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ఉద్యోగాల విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగి, విస్తరించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీయానానికి ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి.

తుల: ఈ రాశికి ఆరవ స్థానంలోకి శని ప్రవేశం వల్ల ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపా రాలు లాభాల బాటపడతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక, ఆస్తి సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరి స్తారు. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తులవారు పేరు తెచ్చుకుంటారు. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

వృశ్చికం: ఈ రాశివారికి శని పంచమ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. అనేక కష్టనష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో చాలా కాలం తర్వాత పదో న్నతులు కలగడానికి, జీతభత్యాలు పెరగడానికి మార్గం సుగమం అవుతుంది. శారీరక, మానసిక ఒత్తిడి నుంచి పూర్తిగా బయటపడతారు. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరు ద్యోగులకు తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆదాయావకాశాలు బాగా పెరుగుతాయి.

మకరం: రాశ్యధిపతి శనీశ్వరుడు తృతీయ స్థానంలోకి ప్రవేశించడంతో ఈ రాశివారికి ఏలిన్నాటి శని దోషం తొలగిపోతుంది. రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందు తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి, జీతాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాటపడ తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.



