AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Subrahmanya Shashti: ఈ రోజు సుబ్రమణ్య షష్టి.. సంతానం కోసం చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే..

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఒకటి సుబ్రహ్మణ్య షష్టి. మార్గ శిర మాసం శుక్లపక్షం శుద్ధ షష్ఠి రోజున కార్తికేయ స్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామిని పుజిస్తారు. దీనినే సుబ్బరాయషష్ఠి, స్కందషష్ఠి అని కూడా పిలుస్తారు. ఈ రోజున సుభ్రమన్యస్వామికి చేసే పూజలు, పరిహారాలు కాల సర్ప దోష నివారణకు, వివాహ, సంతాన సమస్యలను తీరుస్తాయని నమ్మకం.

Subrahmanya Shashti: ఈ రోజు సుబ్రమణ్య షష్టి.. సంతానం కోసం చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే..
Subrahmanya Shashti 2024
Surya Kala
|

Updated on: Dec 07, 2024 | 6:57 AM

Share

శివ పార్వతుల తనయుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజుని సుబ్రహ్మణ్య షష్టిగా జరుపుకుంటారు. ఈ పండుగను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో, తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలున్న ప్రతి చోట విశేష పూజలను జరుపుతారు. ఈ రోజున కార్తీకేయుడితో పాటు సర్పాలను కూడా విశేషంగా పుజిస్తారు. ఈ సుబ్రహ్మణ్య షష్టి రోజున కార్తికేయుడిని పూజించడం వలన వివాహం, సంతాన సమస్యలు తీరతాయని నమ్మకం. మార్గశిర మాసంలో షష్టి తిధి రోజున సుబ్రహ్మణ్య షష్టి విశేష పూజలు చేస్తారు. కొన్ని ఆలయాల్లో కళ్యాణం కూడా జరిపిస్తారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా సమస్యలు తొలగుతాయని, శుభం కలుగుతుందని నమ్మకం. ఈ నేపధ్యంలో ఈ రోజున కార్తికేయుడి అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు చేయడం శుభప్రదం. అవి ఏమిటో తెలుసుకుందాం..

షష్టి తిది ఎప్పుడు వరకూ ఉందంటే

హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ షష్టి తిధి డిసెంబర్ 6 శుక్రవారం మధ్యాహ్నం 12:07 గంటలకు మొదలైంది. ఈ రోజు అంటే డిసెంబర్ 7 మధ్యాహ్నం 11:05 గంటలకు వరకూ ఉంది. ఈ నేపధ్యంలో ఉదయం తిథినే పరిగణలోకి తీసుకుని ఈ రోజున సుబ్రహ్మణ్య షష్టి పండుగను జరుపుకుంటున్నారు.

సుబ్రహ్మణ్య షష్టి రోజు చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే

  1. సుబ్రహ్మణ్య షష్టి రోజు ఉపవాసం ఉండడం విశిష్ట ఫలితాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ని పూజించడం ఉపవాసం చేయడం శరీరాన్ని, మనసును పవిత్రంగా ఉంచేందుకు సహాయపడుతుందని నమ్మకం.
  2. సుబ్రమణ్య ష్టష్టి రోజున స్వామికి పూజ అనంతరం పంచామృతం, పాయసం వంటి పాలతో తయారు చేసిన ప్రసాదాలను చలిమిడి, వడపప్పు వంటి వాటిని సమర్పించాలి.
  3. ఇవి కూడా చదవండి
  4. ఈ రోజున స్వామివారి ఆలయాల్లో పువ్వులు, పడగను సమర్పించడం వలన సమస్యలు తీరతాయని.. శక్తి, ధైర్యం పెరుగుతుందని నమ్మకం.
  5. ఎవరి జతకంలోనైనా సర్పదోషం ఉంటె ఈ రోజు ప్రత్యేక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని నమ్మకం.
  6. సుబ్రహ్మణ్యునికి పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ నిర్వహిస్తే జాతకంలో రాహు-కేతు దోషలనుంచి విముక్తి లభిస్తుంది.
  7. సంతానం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందాలంటే ఈ రోజు స్వామికి పాలు, తేనె, పంచామృతం, పాలు, గంగాజలంతో అభిషేకం చేయాలి. అంతేకాదు కొంతమంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యెక పూజలు నిర్వహించి నాగుల చీర కడతారు.
  8. వివాహంలో జాప్యం జరుగుతుంటే ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తులసి దళాలతో పూజించడం వలన విశేష ఫలితాలు ఉంటాయని నమ్మకం.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.