Astrology 2025: రుజు మార్గంలోకి గురువు.. కొత్త ఏడాది ఆ రాశుల వారికి ఆదాయ వృద్ధి!
Money Astrology 2025: వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్న గురువు ఫిబ్రవరి 5న వక్ర త్యాగం చేసి, రుజు మార్గంలో సంచారం చేయడం ప్రారంభమవుతుంది. రుజు మార్గంలో మే 25 వరకూ సంచారం చేయడం జరుగుతుంది. గురువు వక్రగతి నుంచి బయటపడడంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆదాయపరంగా, ఉద్యోగపరంగా కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.
Astrology 2025: ప్రస్తుతం వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్న గురువు ఫిబ్రవరి 5న వక్ర త్యాగం చేసి, రుజు మార్గంలో సంచారం చేయడం ప్రారంభమవుతుంది. రుజు మార్గంలో మే 25 వరకూ సంచారం చేయడం జరుగుతుంది. గురువు వక్రగతి నుంచి బయటపడడంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆదాయపరంగా, ఉద్యోగపరంగా కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. దీనివల్ల మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులకు అనేక శుభ ఫలితాలు, శుభ యోగాలు అనుభవానికి వస్తాయి.
- మేషం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న గురువు రుజు మార్గం పట్టిన దగ్గర నుంచి ఈ రాశివారి జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది. చాలా కాలంగా ఆగిపోయి ఉన్న శుభ కార్యాలు జరగడం మొదలవుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల నుంచి క్రమంగా విముక్తి లభిస్తుంది. ఆదాయపరంగా అందలాలు ఎక్కే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న గురువు వక్ర త్యాగం చేసినప్పటి నుంచి ఈ రాశివారికి ఆదాయ పరంగా ఊహించని అభివృద్ధి కలుగుతుంది. ఉన్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అన్ని వైపుల నుంచి ధన లాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో దూసుకు పోతాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం కలుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు రుజు మార్గంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడిముబ్బ డిగా వృద్ధి చెందడం వల్ల వాటిని విస్తరించే ఆలోచన చేస్తారు. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతులు లభిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న గురువు రుజు మార్గంలో పయనించడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుం బంతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విజయ వంతంగా పురోగతి చెందుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. మాటకు విలువ పెరుగుతుంది.
- మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న గురువు వక్రత్యాగం చేయడం వల్ల ఈ రాశివారు అత్యధికంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. సామాజికంగా కీర్తి ప్రతిష్ఠలు, పలుకుబడి పెరుగుతాయి. ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అందలాలు ఎక్కుతారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.
- మీనం: ఈ రాశినాథుడు గురువు రుజు మార్గంలో సంచారం చేయడమన్నది ఈ రాశివారికి అత్యంత ముఖ్యమైన విషయం. ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆస్తి సమస్యలు, ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎక్కువగా శుభవార్తలు వింటారు. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలమై ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది.