Bhojeshwar Temple: పాండవులు నిర్మించిన అసంపూర్ణ శివాలయం.. ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం ఎక్కడంటే..

భోజ్‌పూర్ లోని ఈ శివాలయాన్ని 1010 AD నుంచి 1055 AD మధ్యకాలంలో పర్మార్ రాజవంశానికి చెందిన ప్రసిద్ధ భోజ రాజు నిర్మించాడు. ఈ ఆలయాన్ని అసంపూర్ణ దేవాలయం అని కూడా అంటారు. భోజేశ్వరాలయం అసంపూర్ణతకు సంబంధించి ఒక పౌరాణిక కథనం ఉంది. కథ ప్రకారం ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో కొంతకాలం ఇక్కడ ఉన్నారు. పాండవులు తమ తల్లి కుంతీదేవి పూజించేందుకు ఈ ఆలయాన్ని నిర్మించారు.

Bhojeshwar Temple: పాండవులు నిర్మించిన అసంపూర్ణ శివాలయం.. ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం ఎక్కడంటే..
Bhojeshwar Temple
Follow us
Surya Kala

|

Updated on: May 20, 2024 | 7:15 PM

భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు సంబంధించిన పురాణ కథలు చాలా ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అలాంటి దేవాలయం మధ్యప్రదేశ్‌లోని భోజ్‌పూర్‌లో ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన భోజేశ్వర మహాదేవ ఆలయం ఉంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పురాతన శివాలయంలో శ్రావణ మాసమంతా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఆలయ నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు.

భోజేశ్వరాలయం ఎందుకు అసంపూర్తిగా ఉంది? భోజ్‌పూర్ లోని ఈ శివాలయాన్ని 1010 AD నుంచి 1055 AD మధ్యకాలంలో పర్మార్ రాజవంశానికి చెందిన ప్రసిద్ధ భోజ రాజు నిర్మించాడు. ఈ ఆలయాన్ని అసంపూర్ణ దేవాలయం అని కూడా అంటారు. భోజేశ్వరాలయం అసంపూర్ణతకు సంబంధించి ఒక పౌరాణిక కథనం ఉంది. కథ ప్రకారం ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో కొంతకాలం ఇక్కడ ఉన్నారు. పాండవులు తమ తల్లి కుంతీదేవి పూజించేందుకు ఈ ఆలయాన్ని నిర్మించారు.

ఈ ఆలయం పూర్తికాకపోవడానికి కారణం కూడా ఈ ఆలయ నిర్మాణాన్ని ఒకే రోజులో అంటే సూర్యోదయ సమయానికి పూర్తి చేయాల్సి ఉందని.. అయితే పాండవులు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారని అందుకే ఈ భోజేశ్వరాలయ నిర్మాణంలో సగంలోనే ఆగిపోయిందని పౌరాణిక కథనం. నాటి నుంచి ఈ ఆలయం నేటికీ అసంపూర్ణంగా ఉండిపోయింది.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా ప్రసిద్ధి చెందింది. ఒకే రాతితో తయారు చేయబడిన ఈ శివలింగం ఎత్తు 2.3 మీటర్లు, చుట్టుకొలత 5.4 మీటర్లు.. శివ లింగం పావన వంటంతో సహా మొత్తం ఎత్తు 12 మీటర్లు.

దేవాలయం గొప్ప వాస్తుశిల్పం ఈ ఆలయం అసంపూర్తిగా ఉంది. అయితే దీని వాస్తుశిల్పం, నిర్మాణం ఈ ఆలయ ఆకర్షణ కేంద్రంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం 11వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణ శైలికి ఒక ప్రత్యేక ఉదాహరణ. ఈ ఆలయాన్ని పూర్తిగా నిర్మించి ఉంటే.. ఈ ఆలయం ప్రాచీన భారతదేశపు అద్భుత ఆలయంగా పరిగణించబడేది. ఆలయంలో శిల్పకళా సంపద, గోపురాలు, రాతి నిర్మాణాలు చాలా అద్భుతంగా దర్శనం ఇస్తాయి. చూపరులకు కనువిందు చేస్తాయి.

ప్రవేశ ద్వారాలు, వాటికి ఇరు వైపులా అద్భుతంగా చెక్కబడిన బొమ్మలతో అలంకరించబడి ఉంటాయి. గర్భగుడి భారీ ద్వారం ఇరువైపులా గంగా, యమునా విగ్రహాలతో అలంకరించబడి ఉన్నాయి. శివ-పార్వతి, సీతా-రాములు, లక్ష్మీ-నారాయణ, బ్రహ్మ-సరస్వతి విగ్రహాలు నాలుగు స్తంభాలలో నిర్మించబడ్డాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్