Astro Tips: సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. కోరి దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లే..

శాస్త్రాల్లో రోజూ మనిషి అనుసరించాల్సిన ముఖ్యమైన నియమాలను పేర్కొన్నారు. అదే సమయంలో ఏ పనులు చేయడం వలన జీవితంలో కష్టాలు, నష్టాలు ఎదురవుతాయో అనే విషయాలు ప్రస్తావించబడ్డాయి. అటువంటి పరిస్థితిలో ఎవరైనా సరే సూర్యాస్తమయం తర్వాత ఏమి చేయకూడదు? అనే విషయాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం. పెద్దలు చెప్పిన సుద్దులను చాదస్తం అని కొట్టివేసి చాలా మంది ఈ తప్పులను విస్మరించిన వారు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక పొరపాటున కూడా సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Astro Tips: సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. కోరి దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లే..
Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: May 21, 2024 | 2:11 PM

హిందూ సనాతన ధర్మంలో పూజ, ఆరాధన, విశ్వాసాలకు ప్రసిద్ధి చెందింది. అంతేకాదు జీవితంలో నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకూ చేసే పనులు మన జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయని విశ్వాసం. అందుకనే శాస్త్రాల్లో రోజూ మనిషి అనుసరించాల్సిన ముఖ్యమైన నియమాలను పేర్కొన్నారు. అదే సమయంలో ఏ పనులు చేయడం వలన జీవితంలో కష్టాలు, నష్టాలు ఎదురవుతాయో అనే విషయాలు ప్రస్తావించబడ్డాయి. అటువంటి పరిస్థితిలో ఎవరైనా సరే సూర్యాస్తమయం తర్వాత ఏమి చేయకూడదు? అనే విషయాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం. పెద్దలు చెప్పిన సుద్దులను చాదస్తం అని కొట్టివేసి చాలా మంది ఈ తప్పులను విస్మరించిన వారు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక పొరపాటున కూడా సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

సూర్యాస్తమయం సమయంలో ఈ తప్పులు చేయకండి

  1. సూర్యాస్తమయం తర్వాత గోళ్లు, జుట్టు కత్తిరించ వద్దు. జుట్టు క్షవరం చేయించుకోరాదు. ఇలా చేయడం వల్ల అప్పుల బాధ పెరుగుతుంది.
  2. సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకకూడదని అంటారు. వాస్తు ప్రకారం ఇది ప్రతికూల శక్తిని వ్యాపింపజేస్తుంది. అంతే కాకుండా రోగాలు ఆ ఇంట్లోనే ఉంటాయి.
  3. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయ సమయంలో నిద్రించడం అశుభం. ఇలా చేసే వారి ఇళ్లలో శాంతి సౌఖ్యాలు ఉండవని అంటారు. దీనితో పాటు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతారు.
  4. సూర్యాస్తమయం సమయంలో తినడం, త్రాగడం నిషేధం. ఇలా చేయడం వల్ల ఇంట్లో దారిద్ర్యంతో ఇబ్బందులు పడతారు.
  5. ఇవి కూడా చదవండి
  6. సూర్యాస్తమయం తర్వాత డబ్బు లావాదేవీలు చేయకూడదు. ఈ సమయంలో ఇచ్చిన డబ్బు తిరిగి రాదని అంటారు.
  7. సూర్యాస్తమయం తర్వాత కూడా అనుకోకుండా కూడా ఇంటిని ఊడ్చకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
  8. సూర్యాస్తమయం తర్వాత తులసి చెట్టుకు నీరు సమర్పించకూడదు లేదా తులసి చెట్టును తాకరాదు
  9. సూర్యాస్తమయ సమయంలో పాలు, పసుపు, పెరుగు, ఉప్పు, చింతపండు దానం చేయరాదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు