- Telugu News Photo Gallery Spiritual photos Travel India: tour and travel best places to visit near varanasi
Varanasi: వారణాసి వెళ్లాలనుకుంటున్నారా.. విశ్వేశ్వరుడి, విశాలాక్షి దర్శనంతో పాటు.. ఈ ప్రదేశాలను చూడడం మర్చిపోవద్దు
ఉత్తరప్రదేశ్‌లోని గంగా నది ఒడ్డున ఉన్న వారణాసిని బనారస్, కాశీ అని కూడా పిలుస్తారు. ఈ నగర చరిత్ర పురాణాలతో ముడిపడి ఉంది. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రం శివయ్య నగరంగా కూడా పరిగణించబడుతుంది. అందువల్ల వారణాసి నగరం చాలా ప్రత్యేకమైనది. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువుల విశ్వాసం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు కాశీ చేరుకుంటారు. అయితే ఈ నగరంలో అనేక పవిత్రమైన ఆలయాలు ఉన్నాయి. గంగా స్నానం చేయడానికి విశ్వేశ్వరుడి, విశాలాక్షి దర్శనం కోసం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి భారతీయులతో పాటు విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు.
Updated on: May 21, 2024 | 3:16 PM

మీరు కూడా మీ కుటుంబం లేదా స్నేహితులతో బనారస్ వెళ్తున్నట్లయితే.. ఆలయాలను సందర్శించడంతో పాటు ఇక్కడ అనేక ఆలయాలను దర్శించవచ్చు. దీని కారణంగా మీ ఆధ్యాత్మిక ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది

అస్సీ ఘాట్ మీరు బనారస్ వెళుతున్నట్లయితే అస్సీ ఘాట్‌ను తప్పకుండా సందర్శించండి. ఇది గంగా నది సంగమం వద్ద ఉంది. అలాగే రావి చెట్టు క్రింద స్థాపించబడిన భారీ శివలింగానికి ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మహాకవి తులసీదాస్ తుది శ్వాస విడిచినట్లు నమ్ముతారు. చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. సూర్యోదయం, సూర్యాస్తమయంలో ఈ అస్సి ఘాట్ నుంచి కనిపించే దృశ్యం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ గంగా హారతి చూసే అవకాశం కూడా లభిస్తుంది.

గంగా ఘాట్, పడవ ప్రయాణం బనారస్ వెళుతున్నట్లయితే గంగా నదిలో ఖచ్చితంగా బోటు షికారు చేయండి. ఉదయం, సాయంత్రం సమయంలో ఇక్కడ కనిపించే దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది. మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. అస్సీ ఘాట్‌తో పాటు, మున్షీ ఘాట్, మాతా ఆనందమయి ఘాట్, సింధియా ఘాట్, రాజ్ ఘాట్, దశాశ్వమేధ ఘాట్‌లను కూడా అన్వేషించవచ్చు.

విందమ్ జలపాతం బనారస్ విందామ్ జలపాతం వారణాసి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో మీర్జాపూర్ జిల్లాలో ఉంది. దీనికి బ్రిటిష్ కలెక్టర్ వింధామ్ పేరు పెట్టారు. సమీపంలోని ప్రజలకు ఇది సరైన పర్యాటక ప్రదేశం.

షాపింగ్, స్ట్రీట్ ఫుడ్ బనారస్‌లో దాల్మండి మార్కెట్, బజార్దిహ్, తాథేరి మార్కెట్, విశ్వనాథ్ గలి, గొడౌలియా, గోల్ఘర్ మార్కెట్ లో షాపింగ్ చేయవచ్చు. అలాగే, ఆలూ-టిక్కీ, పానీ పూరీ, కచోరీ, జలేబీ, దమ్ ఆలూ, బనారసి కాండ్, బాతి వంటి రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ వంటకాలను తప్పకుండా ప్రయత్నించండి.

భరత్ కళా భవన్ మ్యూజియం భారత కళా భవన్ మ్యూజియం ఒక ప్రసిద్ధ కళ, సాంస్కృతిక మ్యూజియం. 1920లో స్థాపించబడిన ఈ మ్యూజియం బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందినది. పురావస్తు వస్తువులు, పెయింటింగ్‌లు, బట్టలు, దుస్తులు, అలంకార కళలు, పెయింటింగ్‌లు, సాహిత్య మాన్యుస్క్రిప్ట్‌లు, తపాలా స్టాంపులు, పురావస్తు కళాఖండాలతో సహా అనేక కళా వస్తువులు ఇక్కడ ఉన్నాయి.





























