క్యాన్సర్‌కి చికిత్సగా సోషల్ మీడియాలో చూసి క్యారెట్ జ్యూస్ డైట్.. మరణం అంచుల్లో మహిళ
గత కొంత కాలంగా వైద్యుల సలహా తీసుకునే వారి కంటే గూగుల్, యూట్యూబ్ ద్వారా హోం రెమెడీస్ ను చూసి వాటిని పాటించే వారి సంఖ్యే ఎక్కువ. అయితే అలా ఓ మహిళ తన క్యాన్సర్‌కు మందు కనిపెట్టాలని సోషల్ మీడియాను వేదకాలని నిర్ణయించుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రకారం.. ఆమె క్యాన్సర్‌ను నయం చేయడానికి ఒక ఔషధాన్ని ప్రయత్నించింది. ఆ ఔషధం ఆమె జీవితాన్ని చివరి అంచుల వరకూ తీసుకుని వెళ్ళింది.
ఎవరైనా సరే అనారోగ్య బారిన పడితే డాక్టర్‌ని సంప్రదిస్తాం. వ్యాధి తీవ్రతతో నిమిత్తం లేకుండా వైద్యుల సూచనలను పాటిస్తూ ఆ వ్యాధి నుంచి బయట పడతారు. ఆరోగ్య పరిస్థతి కనుక తీవ్రమైతే డాక్టర్ ఇచ్చే అన్ని సలహాలకు కట్టుబడి ఉండటానికి ప్రయత్నిస్తాము. అయితే ప్రస్తుతం కొంతమంది వైద్యులు కంటే సోషల్ మీడియా రెమెడీలను ఎక్కువగా విశ్వసిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే గత కొంత కాలంగా వైద్యుల సలహా తీసుకునే వారి కంటే గూగుల్, యూట్యూబ్ ద్వారా హోం రెమెడీస్ ను చూసి వాటిని పాటించే వారి సంఖ్యే ఎక్కువ. అయితే అలా ఓ మహిళ తన క్యాన్సర్‌కు మందు కనిపెట్టాలని సోషల్ మీడియాను వేదకాలని నిర్ణయించుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రకారం.. ఆమె క్యాన్సర్‌ను నయం చేయడానికి ఒక ఔషధాన్ని ప్రయత్నించింది. ఆ ఔషధం ఆమె జీవితాన్ని చివరి అంచుల వరకూ తీసుకుని వెళ్ళింది.
నివేదికల ప్రకారం యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఇరినా స్టోయినోవా అనే మహిళ చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. 39 ఏళ్ల మహిళ ఇరినా స్టోయినోవాకు 2021లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇటీవల వైరల్ అయిన ఒక వీడియోలో ఇరినా స్టోయినోవా క్యారెట్ రసం క్యాన్సర్‌ను నయం చేస్తుందని చెప్పడాన్ని గమనించింది. ఆ వీడియో చూసిన రోజున జ్యూసర్ కొని తన జ్యూస్ డైట్‌ని ప్రారంభించింది. ఆ రోజూ నుంచి క్యారెట్ జ్యూస్ తాగడం మొదలుపెట్టింది. ఆమె వివిధ రకాల కూరగాయలు, పండ్ల రసాలను తీసుకుంది. అయితే ప్రధానంగా క్యారెట్ రసంపై దృష్టి పెట్టింది. ఈ హోమ్ రెమెడీ ఫలితం చాలా ప్రమాదకరమైనది. దాదాపు ఆమె మరణం అంచుల వరకూ వెళ్ళింది.
హాంప్‌షైర్‌లోని క్రాండాల్ నివాసి వీడియోలో పేర్కొన్నట్లుగా.. ఇరినా స్టోయినోవా ప్రతిరోజూ దాదాపు 13 కప్పుల క్యారెట్ జ్యూస్ తాగింది. ఆమె ఆరోగ్యం నయం కావడం అటుంచి రోజు రోజుకీ దిగజారడం మొదలైంది. అయినప్పటికీ క్యారెట్ జ్యూస్ క్యాన్సర్‌ని నయం చేస్తుందని నమ్మి ఆమె జ్యూస్ డైట్‌ని పూర్తిగా మెయింటెయిన్ చేసింది. కీమోథెరపీని కూడా పట్టించుకోలేదు. ఇంటి చికిత్సను కొనసాగించింది. అయితే చివరికి ఆమె బలహీనపడి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పటికి ఆమె పొత్తికడుపు, కాళ్లు, ఊపిరితిత్తులు ద్రవంతో నిండిపోయాయి. ఆమె శరీరమంతా గడ్డలు ఉన్నాయి. ఐరీనా తన అనుభవాన్ని తెలియజేస్తూ తన ఊపిరితిత్తుల్లో ద్రవం ఉన్నందున తాను శ్వాస తీసుకోలేకపోయానని.. ఈ డైటింగ్ కారణంగా దాదాపు 20 కిలోగ్రాములు కోల్పోయానని చెప్పింది. ఇప్పుడు తాను క్రమంగా కోలుకుంటున్నట్లు వెల్లడించింది.
ఇరినా స్టోయినోవా ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఫ్రిమ్లీ హెల్త్ NHS ఫౌండేషన్‌లోని కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ డాక్టర్ క్లార్ రీస్ వెంటనే చికిత్స మొదలు పెట్టారు. స్కై న్యూస్ నివేదిక ప్రకారం, “ఆమెది చాలా సీరియస్ కండిషన్.. ఐరీనా చేరిన మొదటి 24 గంటల్లో.. ఆమె దీని నుంచి బయటపడుతుందా లేదా అనేది తనకు ఇంకా స్పష్టంగా తెలియలేదు” అని డాక్టర్ చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..