Sleep Tips: నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ప్రశాంతంగా నిద్రపోవడానికి ఈ 5 పనులు చేయండి
ప్రస్తుతం చేసే పనిలో సమయంలో మార్పులు, ఫోన్ వినియోగం లేదా లేట్ నైట్ పార్టీలు వంటి వివిధ కారణాలతో రాత్రి సమయంలో మేలుకుంటున్నారు. రోజు రోజుకీ ఆరోగ్యానికి చాలా హానికరమైన ఆధునిక జీవనశైలి సంస్కృతిగా మారింది. రాత్రి నిద్రపోయే సమయంలో మార్పులు రావడమే కాదు.. నిద్రలో తరచుగా ఆటంకాలు ఎదురవుతున్నా లేదా పడుకున్న తర్వాత కూడా సుఖంగా నిద్రపట్టకపోతే కొన్ని చిట్కాలను పాటించవచ్చు.
నిద్రలేమి సమస్య ఎవరికైనా సరే తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుడ్ని. మానసిక, శారీరక ఆరోగ్యపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మానసిక స్థితి చికాకుగా మారుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు తగినంత నిద్ర లేకపోతే ఊబకాయం కూడా పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా అనేక తీవ్రమైన వ్యాధులకు గురవుతాడు. కనుక ప్రతిరోజూ తగినంత.. అది కూడా సుఖవంతమైన మంచి నిద్ర పొందడం చాలా ముఖ్యం.
ప్రస్తుతం చేసే పనిలో సమయంలో మార్పులు, ఫోన్ వినియోగం లేదా లేట్ నైట్ పార్టీలు వంటి వివిధ కారణాలతో రాత్రి సమయంలో మేలుకుంటున్నారు. రోజు రోజుకీ ఆరోగ్యానికి చాలా హానికరమైన ఆధునిక జీవనశైలి సంస్కృతిగా మారింది. రాత్రి నిద్రపోయే సమయంలో మార్పులు రావడమే కాదు.. నిద్రలో తరచుగా ఆటంకాలు ఎదురవుతున్నా లేదా పడుకున్న తర్వాత కూడా సుఖంగా నిద్రపట్టకపోతే కొన్ని చిట్కాలను పాటించవచ్చు.
స్క్రీన్ సమయాన్ని తగ్గించండి రాత్రి సమయంలో కూడా ఎక్కువగా ఫోన్‌ని ఉపయోగించడం అలవాటు అయితే నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. చాలా సార్లు.. ఫోన్‌ని ఉపయోగించడం మానేసినా నిద్రపోలేరు. ఎందుకంటే స్క్రీన్ నుంచి వెలువడే కాంతి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. దీని కారణంగా నిద్రలేమి సమస్య వస్తుంది. రాత్రి నిద్రించడానికి 1 లేదా 2 గంటల ముందు ఫోన్ కి లేదా కంప్యూటర్‌కి దూరంగా ఉండండి. స్క్రీన్ టైమింగ్ తక్కువగా ఉండేలా ప్రయత్నించండి.
అశ్వగంధ టీ లేదా చమోమిలే టీ తాగండి నిద్ర లేమి నుంచి ఉపశమనం కోసం మంచి నిద్ర కోసం ఉదయం అశ్వగంధ టీని త్రాగవచ్చు, రాత్రి చామంతి టీ తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ హెర్బల్ టీ మెలటోనిన్ (నిద్రకు అవసరమైన హార్మోన్)ను పెంచడమే కాకుండా ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్‌ను తగ్గిస్తుంది. దీంతో ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు.
ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయండి నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారం చేయడం అలవాటు చేసుకోండి. దీంతో పూర్తిగా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. అదే సమయంలో శరీరంలో కార్టిసాల్, మెలటోనిన్ ఉత్పత్తిని సమతుల్యం చేయడంలో కూడా సహాయపడుతుంది. దీని కారణంగా నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.
నిద్రపోయే ముందు ఈ యోగాసనాన్ని చేయండి మంచి నిద్ర కోసం నిద్రపోయే ముందు బెడ్‌పై బలాసనా చేయవచ్చు. ఇది మనస్సును రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు మంచం ప్రాణాయామం చేయండి. యోగాసనంలో, చేతులు, కాళ్ళు పూర్తిగా వదులుగా ఉంటాయి. శరీరం పూర్తిగా రిలాక్స్డ్ భంగిమలో ఉంటుంది. నిద్రపోయే ముందు కొంత సమయం ధ్యానం చేయడం కూడా ప్రయోజనకరం. ఆహారం తిన్న తర్వాత కొంత సమయం పాటు వజ్రాసనం చేయవచ్చు. ఎందుకంటే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా కొన్నిసార్లు నిద్రకు ఆటంకం కలుగుతుంది.
మసాజ్ చేయడం వల్ల ప్రయోజనం రాత్రి సమయంలో సరిగ్గా నిద్రపట్టకపోవడం అనే సమస్య ఉంటే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో పాదాల అరికాళ్లకు మసాజ్ చేసుకోండి. ఇది నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగించడమే కాదు.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని పెంచుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..