Piles Home Remedies: పైల్స్ నొప్పితో బాధపడుతున్నారా? ఈ వంటింటి చిట్కాలు బెస్ట్ రెమిడిస్..
ఆహారపు అలవాట్లలో మార్పులు, సోమరితనం, జీవనశైలి, ఆఫీసులో కదలకుండా ఒకే చోట కూర్చున్నా జాగ్రత్త పైల్స్ లేదా మొలలు వచ్చే ప్రమాదం ఉంది. హేమోరాయిడ్స్ లేదా పైల్స్ పాయువులో మంటను కలిగిస్తాయి. పాయువు లోపల, వెలుపల వాపు సంభవిస్తుంది. మలవిసర్జన చేయడం చాలా కష్టమవుతుంది. నొప్పితో పాటు రక్తస్రావం కూడా అవుతుంది.
రోజు రోజుకు మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రకరకాల కారణాలతో పైల్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. సాధారణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు, సోమరితనం, జీవనశైలి కారణంగా పైల్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. హేమోరాయిడ్స్ లేదా పైల్స్ పాయువులో మంటను కలిగిస్తాయి. పాయువు లోపల, వెలుపల వాపు సంభవిస్తుంది. మలవిసర్జన చేయడం చాలా కష్టమవుతుంది. నొప్పితో పాటు రక్తస్రావం కూడా అవుతుంది. ఎవరైనా రోజూ ఈ సమస్యతో బాధపడుతుంటే.. ఒకొక్కసారి అది ప్రాణాంతక స్థాయికి చేరుకుంటుంది. సాధారణ చికిత్సతో పాటు, జీవనశైలిపై అవగాహన కలిగి ఉండటం వల్ల పైల్స్ రాకుండా కాపాడుకోవచ్చు. అంతేకాదు కొన్ని వంటింటి చిట్కాల సహాయం కూడా తీసుకోవచ్చు.
ఇసబ్ గోల్: శరీరంలో ఫైబర్ లోపం ఉంటే మల విసర్జన కష్టం అవుతుంది. మలబద్ధకం, పైల్స్ సమస్యలు పెరుగుతాయి. కనుక రాత్రి భోజనం తర్వాత ఈ ఇసబ్ గోల్ ను తినండి. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికకు సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒకటి నుండి ఒకటిన్నర చెంచాల ఇసబ్ గోల్ ను కలుపుకుని తాగండి.
అలోవెరా: కలబంద కేవలం చర్మ సంరక్షణకే కాదు. పైల్స్ సమస్యను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది. కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది పేగు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అలోవెరా జెల్ ను పాయువు వద్ద అప్లై చేస్తే ఆసన నొప్పి తగ్గుతుంది. పొట్టను శుభ్రపరచడానికి కలబంద రసం కూడా త్రాగవచ్చు.
ఐస్ క్యుబ్స్: పైల్స్ ప్రభావితమైనప్పుడు మల విసర్జన చేయడం తీవ్ర ఇబ్బంది. పాయువులో తీవ్రమైన వాపు కలుగుతుంది. అప్పుడు లేచి కూర్చోవడం చాలా కష్టం అవుతుంది. కోల్డ్ కంప్రెస్ మల వాపును తగ్గిస్తుంది. రోజుకు 15 నిమిషాల పాటు ఐస్‌ను అప్లై చేయడం వల్ల నొప్పి, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే నేరుగా ఐస్ క్యుబ్స్ ను అప్లై చేయవద్దు. టవల్‌లో చుట్టిన ఐస్ క్యుబ్స్ ను ఉపయోగించండి.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారం: తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల పైల్స్ సమస్య పెరుగుతుంది. కనుక తినే ఆహారం, తాగే పానీయాల పట్ల శ్రద్ధ వహించండి. మలబద్ధకం, పైల్స్ సమస్య నుంచి బయటపడటానికి తినే ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి. ఫైబర్ మలాన్ని మృదువుగా చేయడానికి, కడుపుని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఇది మల నొప్పి, చికాకును తగ్గిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలైన కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తినే ఆహారంలో చేర్చుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..