- Telugu News Photo Gallery Iron Deficiency: Iron Deficiency Symptoms and How to increase Iron Levels Naturally
Iron Deficiency: తరచూ కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుందా? ఇది కారణం కావచ్చు
మన శరీరంలో ఉండే ముఖ్యమైన ఖనిజాలలో ఐరన్ ఒకటి. ఇది హిమోగ్లోబిన్‌ను తయారు చేయడంలో, శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. అందువల్ల శరీరంలో ఐరన్ లోపం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఐరన్ లోపంవల్ల శరీరంలో వివిధ సమస్యలు ఏర్పడతాయి. శరీరంలో ఇనుము లోపం ఉంటే హిమోగ్లోబిన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు, బలహీనత, అలసట భావన ఎల్లప్పుడూ ఉంటుంది..
Updated on: May 20, 2024 | 1:41 PM

మన శరీరంలో ఉండే ముఖ్యమైన ఖనిజాలలో ఐరన్ ఒకటి. ఇది హిమోగ్లోబిన్‌ను తయారు చేయడంలో, శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. అందువల్ల శరీరంలో ఐరన్ లోపం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఐరన్ లోపంవల్ల శరీరంలో వివిధ సమస్యలు ఏర్పడతాయి. శరీరంలో ఇనుము లోపం ఉంటే హిమోగ్లోబిన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు, బలహీనత, అలసట భావన ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా వివిధ వ్యాధులు తలెత్తుతాయి.

శరీరంలో ఐరన్ లోపం వల్ల కనిపించే ప్రధాన లక్షణాలలో అలసట, బలహీనత ముఖ్యమైనవి. ఐరన్ లోపం రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని తగ్గిస్తుంది. ఫలితంగా ఆక్సిజన్ శరీరంలోని వివిధ భాగాలకు సరిగ్గా చేరదు. దీంతో మీరు ఎల్లప్పుడూ అలసటతో, బలహీనంగా కనిపిస్తారు.

శరీరంలో ఐరన్ స్థాయి తక్కువగా ఉంటే, ఆక్సిజన్ మెదడుకు చేరదు. ఫలితంగా తలనొప్పి, తల తిరగడం సమస్య పెరుగుతుంది. కాబట్టి శరీరం బలహీనంగా అనిపించినప్పుడు ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తంలోని ఆక్సిజన్ సామర్థ్యం తగ్గుతుంది. మన శక్తికి ప్రధాన వనరు ఆక్సిజన్. అందువల్లనే ఐరన్ లోపం వల్ల చాలా మందికి శ్వాస ఆడకపోవడం, పని చేస్తున్నప్పుడు ఊపిరి పీల్చుకోలేకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

ఐరన్ లోపాన్ని అధిగమించడానికి తాజా కూరగాయలు అధికంగా తీసుకోవాలి. పాలకూర, బీట్‌రూట్, అత్తి పండ్లు, సోయాబీన్స్, అరటిపండ్లను తినవచ్చు. వీటిల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

మాంసాహారాల్లో.. శరీరంలో ఐరన్ లోపాన్ని భర్తీ చేయడానికి గుడ్లు, చేపలు, మాంసాన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా కొవ్వు అధికంగా ఉండే మత్స్య ఆధారిత చేపలు, మాంసం తినాలి. తద్వారా ఐరన్ పొందవచ్చు. అలాగే రోజువారీ ఆహారంలో పాలు, చీజ్, వెన్న, నిమ్మకాయలు, డ్రై ఫ్రూట్స్‌ను చేర్చుకోవాలి. వాటిలో విటమిన్-సి అధిక స్థాయిలో ఉంటుంది. ఇది శరీరం ఐరన్ గ్రహించడంలో సహాయపడుతుంది. అలాగే రోజుకు కొన్ని బాదంపప్పులు తింటే ఇనుము లోపాన్ని భర్తీ చేస్తాయి.




