- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna Next Movie NBK 110 budget 150 crores in Tollywood Telugu Heroes Photos
Nandamuri Balakrishna: బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలి మరి.! రానున్న రోజులు అరాచకమే..
కరోనా తర్వాత అందరి బిజినెస్‌లు డల్ అయ్యాయేమో కానీ.. బాలయ్య మార్కెట్ మాత్రం డబుల్ అయింది. అంతకుముందున్న బాలయ్యకు.. ఇప్పటి NBKకు అస్సలు పొంతనే లేదు. అందుకే బడ్జెట్ విషయంలోనూ తగ్గేదే లే అంటున్నారు నిర్మాతలు. NBK 110 కోసం ఊహించని బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్. మరి అదెంత..? ఇంతకీ ఆ సినిమా దర్శకుడెవరు.? అఖండ తర్వాత బాలయ్య కెరీర్ రూపురేఖలు మారిపోయాయి.
Updated on: May 20, 2024 | 1:11 PM

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా నుంచి విడుదలైన బర్త్ డే గ్లింప్స్ చూసిన వారికి ఆయన కేరక్టరైజేషన్ ఎలా ఉంటుందో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు.

సినిమాలను పక్కనపెట్టి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసిన నందమూరి బాలకృష్ణ, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కష్టం వృథా పోలేదని అంటున్నారు ఫ్యాన్స్. వీరికి ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

30 ఏళ్ళ తర్వాత హ్యాట్రిక్ కొట్టారు.. వరసగా మూడు సార్లు 100 కోట్లకు పైగా వసూలు చేసారు.. సీనియర్ హీరోలలో ఫస్ట్ టైమ్ ఈ ఫీట్ చేసి చూపించారు.. అసలు బాలయ్య ఇప్పుడు అన్‌స్టాపబుల్ అంతే.

అఖండకు ముందు వరకు కూడా బాలయ్యతో సినిమా అంటే చాలా లిమిటెడ్ బడ్జెట్‌లోనే తీసేవారు. మహా అయితే 30 కోట్లు.. కథ మరీ బాగుంటే 40 కోట్లు.. అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టేవాళ్లు కాదు.

కానీ సీన్ అంతా మారిపోయిందిప్పుడు. భగవంత్ కేసరి కోసం 60 కోట్లు ఖర్చు పెడితే.. ఇప్పుడు బాబీ సినిమా కోసం 80 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు.

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మొత్తానికి సినిమాలు, డిజిటల్, రాజకీయాలు, బసవతారకం.. అన్నింటికీ టైమ్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారు బాలయ్య.

బోయపాటి, బాలయ్య ట్రాక్ రికార్డ్.. ఇప్పుడు బాలయ్య ఉన్న ఫామ్ చూసాక.. ఈ బడ్జెట్ పెద్దదేం కాదంటున్నారు విశ్లేషకులు. పైగా ఇది పాన్ ఇండియన్ సినిమా కూడానూ. మరి ఈ చిత్రంతో బాలయ్య ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలిక.




