- Telugu News Photo Gallery Cinema photos Hero Jr.NTR Fight scene without shirt in Bollywood Telugu Heroes Photos
N. T. Rama Rao Jr: అరవింద సమేత ఫార్ములా వార్ 2 లో రిపీట్ చేస్తున్న తారక్ రామ్.
ఒకప్పుడు ఎన్టీఆర్ లుక్‌పై చాలా కంప్లైంట్స్ ఉండేవి. కథలు మారినా.. ఆయన ఒకేలా కనిపిస్తున్నారని..! కానీ ఇప్పుడలా కాదు.. సినిమాకో విధంగా మారిపోతున్నారు యంగ్ టైగర్. ఈ క్రమంలోనే బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 లోనూ డిఫెరెంట్‌గా దర్శనమివ్వబోతున్నారు తారక్. మరి వార్ 2 కోసం ఆయనేం చేస్తున్నారు..? హృతిక్‌కు డామినేట్ చేయడానికి ఏం ప్లాన్ చేస్తున్నారు.? ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరతో పాటు వార్ 2 కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు.
Updated on: May 20, 2024 | 2:02 PM

ఒకప్పుడు ఎన్టీఆర్ లుక్‌పై చాలా కంప్లైంట్స్ ఉండేవి. కథలు మారినా.. ఆయన ఒకేలా కనిపిస్తున్నారని..! కానీ ఇప్పుడలా కాదు.. సినిమాకో విధంగా మారిపోతున్నారు యంగ్ టైగర్.

ఈ క్రమంలోనే బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 లోనూ డిఫెరెంట్‌గా దర్శనమివ్వబోతున్నారు తారక్. మరి వార్ 2 కోసం ఆయనేం చేస్తున్నారు..? హృతిక్‌కు డామినేట్ చేయడానికి ఏం ప్లాన్ చేస్తున్నారు.?

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరతో పాటు వార్ 2 కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు. కొన్ని రోజులు ముంబై.. కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉంటూ బ్యాలెన్స్ చేస్తున్నారు.

మొన్నటి వరకు వార్ 2తో బిజీగా ఉన్న తారక్.. ఇప్పుడు ఫ్యామిలీతో పాటు టర్కీ వెళ్లారు. వచ్చాక మే చివరి వారం నుంచి దేవరతో బిజీ కానున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఫస్ట్ సింగిల్ కూడా విడుదల కానుంది.

స్క్రీన్ మీద గురుశిష్యులు ఇద్దరూ ఏ రేంజ్‌లో చెలరేగుతారో విట్‌నెస్ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు ప్యాన్ ఇండియా ఆడియన్స్.

అందులో హృతిక్‌తో కలిసి నటిస్తున్నారు తారక్. ఈ సినిమా కోసం బాగా మేకోవర్ అయ్యారు ఎన్టీఆర్. అంతేకాదు.. వార్ 2లో షర్ట్ లేకుండా చాలా సన్నివేశాల్లో కనిపించబోతున్నారని తెలుస్తుంది.

గతంలో టెంపర్ సినిమాలోని ఓ పాటలో.. అరవింద సమేతలోనూ ఫైట్ సీక్వెన్స్‌లో షర్ట్ లేకుండా కనిపించారు తారక్. తాజాగా వార్ 2లోనూ అదే చేస్తున్నారు. వార్‌లో హృతిక్, టైగర్ ష్రాఫ్ మాదిరే.. వార్ 2లో హృతిక్, ఎన్టీఆర్ మధ్య ఫైట్ ఉంటుందని తెలుస్తుంది.

వచ్చే ఏడాది ఆగస్టులో విడుదలకు సిద్ధం కానుంది వార్2. అంటే, ఈ లెక్కన ఈ ప్రాజెక్టు కోసం మరో ఏడాది పాటు పని చేస్తారన్నమాట తారక్.





























