- Telugu News Photo Gallery Cinema photos Kollywood Super Star Ajith's Good Bad Ugly Movie Release Date Announced
Ajith: క్లారిటీ ఇచ్చిన అజిత్.. పొంగల్ ట్రీట్ పక్కా !!
స్టార్ హీరోలు అందరి సినిమాల నుంచి ఏదో ఒక రకమైన అప్‌డేట్ లు ఉంటూనే ఉన్నాయి. మా హీరో మాత్రం ఎందుకో సడన్‌గా సైలెంట్ అయ్యారు. ఈ ఏడాది పొంగల్‌ని మిస్ చేశారు. పోనీ, ఇంకేమైనా అప్‌డేట్స్ ఇస్తున్నారా? అంటే అదీ లేదు... అని రకరకాల రీజన్స్ ని గుర్తుచేసుకుని ఉస్సూరుమనాల్సిన అవసరం లేదు అజిత్ ఫ్యాన్స్. ఇదిగో మీకోసం అంటూ సడన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేశారు తల. ఇంతకీ ఏంటది... ఎక్స్ పెక్ట్ ది అన్ ఎక్స్ పెక్టెడ్ అంటూ తల ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రివీల్ చేసేశారు మేకర్స్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: May 20, 2024 | 7:30 PM

స్టార్ హీరోలు అందరి సినిమాల నుంచి ఏదో ఒక రకమైన అప్‌డేట్ లు ఉంటూనే ఉన్నాయి. మా హీరో మాత్రం ఎందుకో సడన్‌గా సైలెంట్ అయ్యారు. ఈ ఏడాది పొంగల్‌ని మిస్ చేశారు. పోనీ, ఇంకేమైనా అప్‌డేట్స్ ఇస్తున్నారా? అంటే అదీ లేదు... అని రకరకాల రీజన్స్ ని గుర్తుచేసుకుని ఉస్సూరుమనాల్సిన అవసరం లేదు అజిత్ ఫ్యాన్స్.

ఇటీవలే విడాముయర్చి సినిమా కోసం ఫ్లైట్ ఎక్కిన తల ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? మరి ఆయన వచ్చేస్తే, మిగిలిన టీమ్ అక్కడే ఉంటుందా?

కోలీవుడ్ తల అజిత్ ఇప్పుడు ఇండియాకి వచ్చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అజర్‌బైజాన్‌లో ఉన్న ఆయన సోమవారం ఇండియాలో ల్యాండ్ కావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఈ పొంగల్ హంగామాని కూడా యాడ్ చేసి వచ్చే ఏడాది డబుల్, ట్రిపుల్‌గా థియేటర్లలో దుమ్మురేపడానికి మేం రెడీ అంటున్నారు ఫ్యాన్స్. 2025 పొంగల్‌కి పక్కాగా విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్.

ఆల్రెడీ అజిత్ చేస్తున్న విడాముయర్చి సినిమా ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదలవుతుందనే టాక్ ఉంది. సో బ్యాక్ టు బ్యాక్ రెండు మూవీస్‌తో పండగ చేసుకోబోతున్నారు తల అభిమానులు.





























