- Telugu News Photo Gallery Cinema photos Prabhas fans reaction on kalki movie promotions release on June 27th Telugu Heroines Photos
Prabhas – Kalki: మళ్లీ మొదలు.. ఎందుకిలా.? కల్కిపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా.!
కల్కి 2898 AD ప్రమోషన్స్ ఎక్కడ..? వైజయంతి మూవీస్‌ను ప్రభాస్ ఫ్యాన్స్ నేరుగా అడుగుతున్న ప్రశ్న ఇదే. అసలు ఈ చిత్ర షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? అనుకున్న తేదీకే వస్తుందా లేదంటే ఆలస్యం అవుతుందా..? ఆల్రెడీ మే మధ్యలో ఉన్నాం.. చూస్తుండగానే జూన్ కూడా వచ్చేస్తుంది. మరి కల్కి ప్రమోషన్ ముచ్చటేంటి..? ప్రభాస్ ఫ్యాన్స్‌కు మేకర్స్ ఇచ్చే ఆన్సర్ ఏంటి..? ఎట్టి పరిస్థితుల్లో జూన్ 27న కల్కి సినిమా వస్తుంది.. ఈ ముక్క కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు చెప్తూనే ఉన్నారు.
Updated on: May 20, 2024 | 12:10 PM

కల్కి 2898 AD ప్రమోషన్స్ ఎక్కడ..? వైజయంతి మూవీస్‌ను ప్రభాస్ ఫ్యాన్స్ నేరుగా అడుగుతున్న ప్రశ్న ఇదే. అసలు ఈ చిత్ర షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? అనుకున్న తేదీకే వస్తుందా లేదంటే ఆలస్యం అవుతుందా..? ఆల్రెడీ మే మధ్యలో ఉన్నాం.. చూస్తుండగానే జూన్ కూడా వచ్చేస్తుంది.

మరి కల్కి ప్రమోషన్ ముచ్చటేంటి..? ప్రభాస్ ఫ్యాన్స్‌కు మేకర్స్ ఇచ్చే ఆన్సర్ ఏంటి..? ఎట్టి పరిస్థితుల్లో జూన్ 27న కల్కి సినిమా వస్తుంది.. ఈ ముక్క కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు చెప్తూనే ఉన్నారు.

అందుకే పర్సనల్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకుని.. కల్కికి డేట్స్ ఇచ్చారు ప్రభాస్. కల్కి 2898 AD షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. అంతా బాగానే ఉన్నా.. ప్రమోషన్స్ విషయంలో మాత్రం అస్సలు నోరు మెదపడం లేదు దర్శక నిర్మాతలు.

కల్కి షూటింగ్ చివరిదశకు వచ్చింది. ఇది రెండు భాగాలుగా వస్తుందని ప్రచారం జరుగుతున్నా.. దీనిపై క్లారిటీ లేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. పుష్ప 2 రిలీజ్‌కు 4 నెలల ముందే ఫస్ట్ సింగిల్ విడుదల చేసారు.

దేవరకు 5 నెలల ముందే పాట విడుదల చేయబోతున్నారు.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ తెలియకపోయిన పాట వచ్చేసింది. కానీ కల్కి రిలీజ్ నెలన్నరే ఉన్నా.. ఇంకా కనీసం అనౌన్స్‌మెంట్ రాలేదు.

సలార్ ప్రమోషన్స్ విషయంలోనూ హోంబళే ఫిల్మ్స్ ఇదే చేసారు. అప్పుడు కూడా సోషల్ మీడియాలో గోల చేసారు ఫ్యాన్స్. ఇప్పుడు వైజయంతి మూవీస్‌కు ఈ బాధ తప్పట్లేదు.

జూన్ 27న సినిమా సరే.. ముందు ఒక టీజరో, సాంగో విడుదల చేయమంటున్నారు అభిమానులు. అన్నట్లు మే 22న RFCలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు కల్కి టీం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.




