- Telugu News Photo Gallery Cinema photos Actress Rashmika Mandanna Post creates political heat on her short time journey Telugu Heroines Photos
Rashmika Mandanna: వాళ్ళ పాలిటిక్స్‌కు స్టార్ హీరోయిన్ బలి.. రష్మిక అలెర్ట్.!
రష్మిక మందన్న అనుకోని వివాదంలో ఇరుక్కున్నారా..? కోరి కోరి కొరివితో తల గోక్కున్నారా..? అదేంటి అంత మాట అనేసారు అనుకుంటున్నారు కదా..? ఆమె తీరు చూస్తుంటే అదే అనిపిస్తుందిప్పుడు. ఊరికే ఉండకుండా ఓ వీడియో చేసారు. ఇప్పుడదే వీడియో ఆమె కొంప ముంచేలా కనిపిస్తుంది. రాజకీయాల్లోకి లాగి ల్యాగ్ లేకుండా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ రష్మిక చేసిన తప్పేంటి.? సినిమా వాళ్లు సినిమాల్లో ఉన్నపుడు ఏం చేసినా ఎవరికీ ఏ సమస్యా ఉండదు.
Updated on: May 20, 2024 | 11:53 AM

రష్మిక మందన్న అనుకోని వివాదంలో ఇరుక్కున్నారా..? కోరి కోరి కొరివితో తల గోక్కున్నారా..? అదేంటి అంత మాట అనేసారు అనుకుంటున్నారు కదా..? ఆమె తీరు చూస్తుంటే అదే అనిపిస్తుందిప్పుడు.

ఊరికే ఉండకుండా ఓ వీడియో చేసారు. ఇప్పుడదే వీడియో ఆమె కొంప ముంచేలా కనిపిస్తుంది. రాజకీయాల్లోకి లాగి ల్యాగ్ లేకుండా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ రష్మిక చేసిన తప్పేంటి.? సినిమా వాళ్లు సినిమాల్లో ఉన్నపుడు ఏం చేసినా ఎవరికీ ఏ సమస్యా ఉండదు.

కానీ వాళ్లు కంపౌండ్ దాటి బయటికొచ్చి.. రాజకీయాల గురించి మాట్లాడారంటే మాత్రం ఎక్కడలేని కోపాలొస్తాయి కొందరికి. అనవసరంగా ట్రోల్స్ చేస్తూనే ఉంటారు వాళ్లపై. తాజాగా రష్మిక మందన్న విషయంలో ఇదే జరుగుతుంది.

ఈమె పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచేస్తుంది. చూస్తున్నారుగా.. అటల్ సేతు బ్రిడ్జ్‌ను పొగుడుతూ రష్మిక పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు దుమారం రేపుతుంది. పైగా దీనికి మోదీ రిప్లై ఇవ్వడంతో విషయం మరింత పెద్దదైంది.

హఠాత్తుగా మోదీ సర్కార్‌పై ప్రశంసలెందుకో అంటూ రష్మికను టార్గెట్ చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. కాంగ్రెస్ అయితే ఓ అడుగు ముందుకేసి.. ఐటి రైడ్స్ నుంచి తప్పించుకోడానికి మోదీని కాకా పడుతుందంటూ రష్మికపై ఆరోపణలు చేస్తున్నారు.

రష్మిక మందన్నకు మాత్రమే కాదు.. మొన్నటికి మొన్న ఫ్రెండ్ శిల్పా రవి కోసం నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్‌పై కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో చాలా చర్చ జరిగింది.

స్నేహం కోసమే అని బన్నీ చెప్పినా.. దాన్ని చాలా దూరం తీసుకెళ్లారు కొందరు. మొత్తానికి పుష్ప 2 విడుదలకు ముందు ఇలా హీరో హీరోయిన్లు ఇద్దరూ పొలిటికల్‌గా హైలైట్ అవ్వడంపై ఇండస్ట్రీలోనూ చర్చ నడుస్తుంది.




